ఓటీఎస్ దరఖాస్తు కారణంగా సమన్లు రద్దు చేయలేం..విచారించే అధికారం ఈడీకి ఉందన్న హైకోర్టు
V6 Velugu · V6 Velugu · 2 min read at V6 Velugu
హైదరాబాద్, వెలుగు: మోసపూరితంగా ఫోర్జరీ పత్రాలు తాకట్టు పెట్టి తీసుకున్న రుణాన్ని ఓటీఎస్ కింద చెల్లించడానికి పెట్టుకున్న దరఖాస్తు పెండింగ్లో ఉందన్న కారణంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జారీ చేసిన సమన్లను రద్దు చేయలేమని హైకోర్టు స్పష్టం చేసింది. మోసం, ఫోర్జరీ వంటి తీవ్రమైన నేరాల ఆరోపణలు ఉన్నప్పుడు బ్యాంకుతో ఆర్థిక వివాదాన్ని పరిష్కరించుకోవడం వల్ల క్రిమినల్ కేసు దర్యాప్తు ముగిసిపోదని, సమన్లు జారీ చేసి దర్యాప్తు చేసే అధికారం ఈడీకి ఉందని పేర్కొంది. రూ.4.82 కోట్ల మేర బ్యాంకును మోసగించారంటూ 2021లో నమోదైన సీబీఐ కేసు ఆధారంగా 2026 ఆగస్టులో ఈడీ జారీ చేసిన సమన్లను సవాల్…
పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. బ్యాంకు రుణాన్ని చెల్లించడానికి సిద్ధంగా ఉన్నామని, దీని కోసం ఓటీఎస్ కింద దరఖాస్తు చేసుకున్నామని తెలిపారు. ఈడీ దర్యాప్తుకు సహకరిస్తామని, అరెస్ట్ వంటి బలవంతపు చర్యలు తీసుకోరాదని ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఈడీ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్లు క్షత్రియ కన్స్ట్రక్షన్స్ పేరుతో బ్యాంకుకు ఫోర్జరీ పత్రాలు సమర్పించి రుణం పొందడం ద్వారా రూ.4.82 కోట్లు నష్టం వాటిల్లిందని చెప్పారు. అప్పటికే మరో బ్యాంకులో తాకట్టు పెట్టిన పత్రాలను సృష్టించి తిరిగి రుణం పొందారన్నారు.
Excerpt. Full story at V6 Velugu: https://www.v6velugu.com/telangana-high-court-rules-ed-summons-valid-despite-pending-ots-application
framing not published · 1 outlet covered this story, below the floor for a split