‘పారిశ్రామికవాడ సారపాకలో మౌలిక సదుపాయాలు కల్పించాలి’
Namasthe Telangana · NT News telugu · 1 min read at Namasthe Telangana
– ఈవోకు ప్రజాసమస్యలపై బీఆర్ఎస్ నేతల వినతి
బూర్గంపహాడ్, అక్టోబర్ 17 : బూర్గంపహాడ్ మండలం సారపాకలో మౌలిక సదుపాయాలు కల్పించి ప్రజా సమస్యలను పరిష్కరించాలని బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు కొనకంచి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో శనివారం ఈవో గుగులోత్ రవికుమార్‌కు నాయకులతో కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. వీధి దీపాలు ఏర్పాటు చేయడంతో పాటు తాగునీటి సరఫరాలో ఇబ్బందులు తొలగించాలని, మురుగు కాల్వల శుభ్రత పూర్తిగా లోపించిందని, చెత్త తొలగింపులో పంచాయతీ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని, దోమల నివారణకు చర్యలు చేపట్టాలని, అంతర్గత రహదారులకు మరమ్మతులు చేయించాలని డిమాండ్ చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడం, గ్రామాల అభివృద్ధిపై…
Excerpt. Full story at Namasthe Telangana: https://www.ntnews.com/khammam/badradri-kothagudem/infrastructure-facilities-should-be-provided-in-the-industrial-area-2538701
framing not published · 1 outlet covered this story, below the floor for a split