పదవి కోసం హడావిడిగా పెళ్లి.. చివరకు! - Visalaandhra
Visalaandhra · Shanthi · 1 min read at Visalaandhra
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల వేళ ప్రధాన పార్టీల్లో ఆశావహులు టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. నామినేషన్లకు మూడు రోజులే గడువు ఉండటంతో పార్టీలు కూడా వీలైనంత త్వరగా అభ్యర్థుల్ని ప్రకటించాలని భావిస్తున్నాయి. అయితే స్థానిక సంస్థల ఎన్నికలకు రిజర్వేషన్లు ప్రకటించిన తర్వాత పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో పొలిటికల్ పెళ్లి హాట్‌టాపిక్ అయ్యింది..
సాలూరు మున్సిపల్ ఛైర్పర్సన్ పదవి BC మహిళకు కేటాయించడంతో TDP నాయకుడు తన ప్రేయసి మంజీరను గుడిలో హడావిడిగా పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఎన్నికల బరిలోకి దిగాలనే ఉద్దేశంతో బంధువులనూ పిలవకుండా అత్యవసర వివాహం చేసుకున్నారు. కాగా, కూటమి సీట్ల సర్దుబాటులో ఆ స్థానం జనసేనకు ఖరారైంది. పాపం ముహూర్తాలు లేకపోయినా పదవి కోసం హడావిడిగా బంధువుల్ని కూడా పిలవకుండా పెళ్లి చేసుకున్న యువనేత హర్షవర్ధన్‌కు నిరాశ తప్పలేదు.
Excerpt. Full story at Visalaandhra: https://visalaandhra.com/tdp-leader-who-got-married-for-the-sake-of-the-municipal-chairperson-post-in-salur-faces-a-shock
framing not published · 1 outlet covered this story, below the floor for a split