Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Namasthe Telangana · NT News telugu · 2 min read at Namasthe Telangana
Palapitta | ఒకప్పుడు పల్లెల్లో, పొలాల గట్లపై, చెట్ల కొమ్మల్లో, విద్యుత్తు తీగలపై విరివిగా కని పించే పాలపిట్ట సంతతి మారుతున్న పర్యావరణ పరిస్థితులతో క్రమంగా కనుమరుగవుతున్నది. దసరా పండుగ సమయంలో పాలపిట్టను చూడటం శుభప్రదమనే నమ్మకం ఉండటంతో ఈ పక్షికి తెలంగాణ సంస్కృతిలో ప్రత్యేక స్థానం ఉన్నది. అందుకే బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్‌రావు దీనిని తెలంగాణ రాష్ట్ర పక్షిగా అధికారికంగా గుర్తించారు. అయితే గత దశాబ్దకాలంలో వీటిసంఖ్య గణ నీయంగా తగ్గినట్టు పక్షుల సర్వేలు వెల్లడిస్తున్నాయి.
పట్టణీకరణ, చెట్ల నరికివేత, వ్యవసాయంలో పురుగుమందుల అధిక వినియోగం, ఆవాసాల కొరత, అక్రమంగా పట్టుకోవడం, చైనా మాంజా వంటి అనేక ముప్పులు పాలపిట్టల మనుగడపై ప్రభావం చూపుతున్నాయి. పాలపిట్టలు సాధారణంగా పాత చెట్ల తొర్రలు,చెట్లలోని ఖాళీ ప్రదేశాల్లో గూళ్లు ఏర్పాటు చేసుకుంటాయి. అలాంటి చెట్లు తగ్గిపోవ డంతో సంతానోత్పత్తికి అనుకూలమైన ప్రదే శాలు కూడా తగ్గుతున్నట్టు నిపుణులు గుర్తించారు. దసరా రోజు సాయంత్రం జమ్మి పూజ అనంతరం పాలపిట్టను చూస్తే విజయాలు, శుభాలు కలుగుతాయని చాలామంది విశ్వసిస్తారు. అందుకే ఈ పక్షి తెలంగాణ సంస్కృ తిలో కేవలం ఒక పక్షిగా కాకుండా దసరా సంప్రదాయంలో భాగంగా మారింది. దసరా సందర్భంగా పాలపిట్టను…
Excerpt. Full story at Namasthe Telangana: https://www.ntnews.com/telangana/telangana-state-bird-palapitta-in-danger-why-are-indian-rollers-becoming-rare-2540512
framing not published · 1 outlet covered this story, below the floor for a split