పండగ రోజు తగ్గిన బంగారం రేట్లు.. దసరా రోజున హైదరాబాదులో గ్రాము ఎంతంటే?
V6 Velugu · V6 Velugu · 1 min read at V6 Velugu
గడచిన రెండు మూడు రోజులుగా పెరుగుతున్న బంగారం ధరలు దసరా పండుగ రోజున మాత్రం ఊహించని రీతిలో తగ్గుముఖం పట్టాయి. పండుగ రోజున ఒక పక్క గోల్డ్ షాపు ఓనర్లు ఇచ్చే తగ్గింపులకు తోడు బంగారం రేట్లు పతనం కావటం చాలా మంది తెలుగు కుటుంబాలను ఆకర్షిస్తోంది. దీనిని సధ్వినియోగం చేసుకుందాం అనుకుంటున్న ప్రజలు ముందుగా తమ నగరాల్లో ఈ రోజు తగ్గిన రిటైల్ విక్రయ ధరలను పరిశీలించటం బెటర్.
అక్టోబర్ 20, దసరా పండుగ రోజున బంగారం రేట్లు తగ్గాయి. దేశవ్యాప్తంగా 24 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.87 తగ్గింది. దీంతో హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు రూ.14వేల 717గా కొనసాగుతోంది. ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.13వేల 490గా కొనసాగుతోంది.
Excerpt. Full story at V6 Velugu: https://www.v6velugu.com/gold-rates-fell-sharply-on-dusheera-day-know-hyderabad-rates-today
framing not published · 1 outlet covered this story, below the floor for a split