పండగకు ఊరెళ్తుండగా విషాదం.. హయత్ నగర్ లో స్కూటీని ఢీ కొట్టిన థార్ .. అన్నాచెల్లెలు మృతి
V6 Velugu · V6 Velugu · 1 min read at V6 Velugu
హైదరాబాద్: హయత్నగర్ పరిధిలో విజయవాడ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన థార్ కారు స్కూటీని ఢీకొట్టడంతో అన్నాచెల్లెలు అక్కడికక్కడే మృతి చెందారు. వారితో పాటు ప్రయాణిస్తున్న నాలుగేళ్ల చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదంతో ఆ ప్రాంతంలో విషాదం నెలకొంది.
అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం.. అన్నాచెల్లెలు స్కూటీపై చెల్లెలి నాలుగేళ్ల కుమార్తెతో కలిసి పండగ సందర్భంగా స్వగ్రామానికి బయలుదేరారు. ఈ క్రమంలో హయత్నగర్ వద్ద విజయవాడ హైవేపైకి వచ్చిన థార్ కారు వారి స్కూటీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అన్నాచెల్లెలు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. చిన్నారికి తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
Excerpt. Full story at V6 Velugu: https://www.v6velugu.com/brother-and-sister-died-as-thar-suv-hits-scooty-4-year-old-girl-injured-in-hyderabad
framing not published · 1 outlet covered this story, below the floor for a split