పండక్కి ఊరు వెళ్లేవాళ్లకు గుడ్ న్యూస్.. దసరాకు 7 వేల ప్రత్యేక బస్సులు
V6 Velugu · V6 Velugu · 2 min read at V6 Velugu
హైదరాబాద్: దసరా పండుగను పురస్కరించుకుని సొంత ఊళ్లకు వెళ్లే ప్రయాణికులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) గుడ్ న్యూస్ చెప్పింది. దసరాకు 7 వేల ప్రత్యేక బస్సులను అందుబాటులోకి తెచ్చినట్లు ఆర్టీసీ ఎండీ వై.నాగిరెడ్డి తెలిపారు. ఈ నెల 10వ తేదీ నుంచి ఇప్పటివరకు సుమారు 95 శాతం బస్సులను విజయవంతంగా నడిపి ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చామని వెల్లడించారు.
శుక్రవారం (అక్టోబర్ 17) హైదరాబాద్ జూబ్లీ బస్ స్టేషన్ (JBS)ను ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు (ఈడీలు) సీహెచ్. వెంకన్న, ఏ.శ్రీధర్‌లతో కలిసి ఎండీ నాగిరెడ్డి స్వయంగా పరిశీలించారు. జెబిఎస్లో ప్రత్యేక విధులు నిర్వర్తిస్తున్న సికింద్రాబాద్ ఆర్ఎం సుచరిత, కరీంనగర్ ఆర్ఎం రాజులతో బస్సుల నిర్వహణ, ట్రాఫిక్‌కు సంబంధించి సమీక్షించారు.
Excerpt. Full story at V6 Velugu: https://www.v6velugu.com/tgsrtc-has-arranged-7000-special-buses-for-dasara
framing not published · 1 outlet covered this story, below the floor for a split