పండుగ వేళ.. విషాదం
Namasthe Telangana · NT News telugu · 1 min read at Namasthe Telangana
హయత్నగర్, అక్టోబర్ 18: కారు ఢీకొని అక్కా తమ్ముడు మృతిచెందిన ఘటన హయత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. అబ్దుల్లాపూర్మెట్ మండలం, పెద్దఅంబర్పేటకు చెందిన ఎడుల్ల జంగయ్య కూతురు రేఖ(25) శంషాబాద్లోని సుల్తాన్పల్లిలో నివాసముంటోంది. దసరా పండుగ ఉండడంతో పుట్టింటికి వచ్చేందుకు రేఖ తన మూడున్నరేండ్ల కుమార్తెను తీసుకొని.. ఎల్బీనగర్కు వచ్చింది.
అక్కడి నుంచి బాబాయి కుమారుడు నవీన్(18).. రేఖ, ఆమె కూతురిని తీసుకొని వాహనంపై బయలుదేరాడు. మార్గమధ్యలో హయత్నగర్లోని ఆర్టీసీ బస్టాండ్, అంబేద్కర్ విగ్రహం వద్దకు రాగానే ముందుగా వెళ్తున్న వాహనం ఒక్కసారిగా బ్రేకులు వేయడంతో వీరి ద్విచక్రవాహనాన్ని వెనుక నుంచి అతివేగం, అజాగ్రత్తగా దూసుకొచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో నవీన్, రేఖ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందారు. వీరితోపాటు ఉన్న చిన్నారికి తీవ్ర గాయాలు కావడంతో వెంటనే ఆమెను చికిత్స కోసం స్థానిక ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన కారు యజమానిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని…
Excerpt. Full story at Namasthe Telangana: https://www.ntnews.com/hyderabad/tragic-dussehra-accident-in-hayathnagar-brother-and-sister-killed-2539684
framing not published · 5 outlets covered this story, below the floor for a split