పీసీసీ చీఫ్, పొంగులేటికి బీఆర్ఎస్ నోటీస్
Namasthe Telangana · NT News telugu · 1 min read at Namasthe Telangana
హైదరాబాద్, అక్టోబర్ 19 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రతిష్ఠను దెబ్బతీసేలా వ్యాఖ్యానించిన తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎంపీ గడ్డం వంశీకృష్ణలకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు జారీ చేసింది. కొండపోచమ్మసాగర్ నీటిని కేసీఆర్ తన ఫామ్‌హౌస్‌కు మళ్లించారని తప్పుడు ప్రచారం చేస్తున్నందుకు బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ, లీగల్ సెల్ ఇన్చార్జి సోమ భరత్‌కుమార్ సోమవారం ఈ నోటీసులు పంపించారు.
ఇదే అంశంపై ఇప్పటికే వెలుగు దినపత్రిక యాజమాన్యం, ఎడిటర్‌కు నోటీసులు జారీ అయ్యాయి. అదే ప్రచారాన్ని కొనసాగిస్తున్న ముగ్గురు కాంగ్రెస్ నేతలకు కూడా నోటీసులు పంపించారు. తమ సోషల్‌మీడియా ఖాతాల్లో చేసిన పోస్టులను తొలగించి, తప్పుడు ప్రచారాన్ని ఉపసంహరించుకోవాలని నోటీసులో డిమాండ్ చేశా రు. సాగునీటి ప్రాజెక్టులపై నిరాధార ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు చేస్తున్న ప్రయత్నాలను సహించబోమ ని హెచ్చరించారు. నోటీసులకు స్పందించక పోతే పరువునష్టం సహా వర్తించే చట్టాల ప్ర కారం చర్యలు చేపడతామని స్పష్టం చేశారు.
Full story at Namasthe Telangana: https://www.ntnews.com/telangana/brs-issues-legal-notices-to-congress-leaders-over-kcr-allegations-2540568
framing not published · 11 outlets covered this story, below the floor for a split