ఫామ్-6 దరఖాస్తులు 10.22 లక్షలు
Namasthe Telangana · NT News telugu · 2 min read at Namasthe Telangana
హైదరాబాద్, అక్టోబర్ 14 (నమస్తే తెలంగాణ): ఓటు హక్కు కోసం రాష్ట్రంలో యువత పెద్దసంఖ్యలో దరఖాస్తు చేసుకున్నారు. కొత్త ఓటరుగా నమోదు చేసుకోవడానికి లేదా ఒక నియోజకవర్గం నుంచి వేరొక నియోజకవర్గానికి ఓటు హకును మార్చుకోవడానికి ఫామ్-6 ద్వారా ఇప్పటివరకు 10.22 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. విదేశాల్లో నివసిస్తున్న భారతీయ పౌరులు(ఎన్నారైలు) తమ పేరును ఓటర్ల జాబితాలో చేర్చడం కోసం ఫామ్-6ఏ ద్వారా 8,100 మంది దరఖాస్తు చేశారు.
ఓటరు గుర్తింపు కార్డు(ఎపిక్)లో పేరు, వయస్సు, ఫొటో, చిరునామా, తండ్రి/భర్త పేరు వంటి వివరాల మార్పులు లేదా సవరణల కోసం ఫామ్-8 ద్వారా 11.23 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) కార్యాలయవర్గాల వివరాల ప్రకారం.. 7.91 లక్షల ఫామ్-8 దరఖాస్తులకు ఈసీ ఆమోదం తెలిపింది. ఫామ్-6 ద్వారా అందిన దరఖాస్తుల్లో 4,28,965 ఆమోదం పొందగా, 2,12,931 తిరసరణకు గురయ్యాయి. మరో 3,80,861 పెండింగ్లో ఉన్నాయి. ఓటర్ల జాబితాలో వివరాల సవరణ, చిరునామా మార్పు తదితర అవసరాలకు సంబంధించిన ఫామ్-8 కింద మొత్తం 11,23,245 దరఖాస్తులు అందాయి. వీటిలో 7,91,937 ఆమోదం పొందాయి. 1,32,975 తిరసరణకు గురికాగా…
Excerpt. Full story at Namasthe Telangana: https://www.ntnews.com/telangana/telangana-receives-5-43-lakh-form-7-applications-for-voter-list-changes-2536887
framing not published · 1 outlet covered this story, below the floor for a split