ఫిల్మ్ చాంబర్ దగ్గర తీవ్ర ఉద్రిక్తత.. ఫెడరేషన్ సమావేశంలోకి దూసుకెళ్లిన సుమలత.. వాగ్వాదం!
V6 Velugu · V6 Velugu · 2 min read at V6 Velugu
టాలీవుడ్ ఫిల్మ్ చాంబర్ దగ్గర తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఫెడరేషన్ సమావేశంలోకి జానీ మాస్టర్ భార్య సుమలత వర్గం దూసుకెళ్లంది. ఫెడరేషన్ నాయకులతో వాగ్వాదానికి దిగారు.. సమావేశానికి తనను ఎందుకు అనుమతించలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ .. చాంబర్ బయట సుమలత ఆందోళనకు దిగారు. దీంతో సుమలతకి 23 క్రాఫ్ట్ లకు మధ్య వాదోపవాదనలు చోటు చేసుకున్నాయి. సుమలతకి మద్దతుగా పలువురు డాన్సర్లు పాల్గొన్నారు.
ఈ సందర్బంగా డాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలిని సమావేశానికి ఎందుకు అనుమతించలేదని సుమలత ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను జానీ మాస్టర్ వైఫ్ అయినందుకే నన్ను టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు. నన్ను తప్పించింది కూడా అందుకే . జాని మాస్టర్ కు నేను భార్యనే, కానీ డాన్సర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ను కాదా.. నన్ను ఎలా టార్గెట్ చేస్తారు ? అని సుమలత ప్రశ్నించారు. నా ఫైట్ నాది.. జాని మాస్టర్ కి నాకు సంబంధం ఏంటి? నా మీద కోపాన్ని జాని మాస్టర్ మీద చూపిండం.. నాన్ కోపరేషన్ పెట్టడం ఏంటి? అని ప్రశ్నించారు. ఆయనను ఇండస్ట్రీలో లేకుండా చేయాలి కుట్ర చేస్తున్నారని సుమలత ఆరోపించారు..
Excerpt. Full story at V6 Velugu: https://www.v6velugu.com/johnny-master-wife-suma-latha-stages-protest-outside-film-chamber
framing not published · 1 outlet covered this story, below the floor for a split