ఫ్రాన్స్ లో నిరసనలు హింసాత్మకం..దేశవ్యాప్తంగా కర్ఫ్యూ..అత్యవసర పరిస్థితి దిశగా ప్రభుత్వం చర్యలు?
V6 Velugu · V6 Velugu · 2 min read at V6 Velugu
ఫ్రాన్స్‌లో ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా ప్రజల నిరసనలు హింసాత్మకంగా మారాయి. పెట్రోల్, డీజిల్, ఆహార పదార్థాల ధరలు పెరగడంతో గత కొన్ని వారాలుగా కొనసాగుతున్న నిరసనలు వారాంతంలో దేశవ్యాప్తంగా ఉద్రిక్తతలకు దారితీశాయి. పారిస్ తో పాటు పలు నగరాల్లో జరిగిన హింసాత్మక ఆందోళనలు అల్లర్లు, ప్రభుత్వ కార్యాలయాలకు నిప్పు పెట్టడం, దోపిడీలకు దారితీయడంతో భద్రతా చర్యలను ఫ్రాన్స్ కట్టుదిట్టం చేస్తోంది. అల్లర్లను అదుపులో తెచ్చేందుకు కర్ఫ్యూ విధించాలని ఫ్రాన్స్ ప్రధాన మంత్రి సెబాస్టియన్ లెకార్నో పోలీసులను సోమవారం తెలిపారు. అవసరమైతే ఎమర్జెన్సి విధిస్తామని ప్రకటించారు.
ఫ్రాన్స్‌లో ద్రవ్యోల్బణం, పెరిగిన జీవన వ్యయం (Cost of Living Crisis) ,విద్యావ్యవస్థలోని లోపాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్త నిరసనలు ఉధృతమయ్యాయి. గత కొన్ని వారాలుగా కేవలం విద్యార్థులకే పరిమితమైన ఈ ఉద్యమంలోకి ప్రస్తుతం కార్మిక సంఘాలు, 'ఎల్లో వెస్ట్' నిరసన కారులు, సాధారణ ప్రజలు చేరడంతో నిరసనలు హింసాత్మకంగా మారాయి. కేవలం ఒకే రోజున దేశవ్యాప్తంగా సుమారు 5.5 లక్షల నుంచి8 లక్షల మంది ప్రజలు రోడ్లపైకి వచ్చి తమ నిరసనలు తెలిపారు.
Excerpt. Full story at V6 Velugu: https://www.v6velugu.com/france-protests-turn-violent-over-rising-prices-pm-orders-curfews-warns-of-emergency-measures
framing not published · 1 outlet covered this story, below the floor for a split