ఫ్రిస్కోలో ఘనంగా TPAD బతుకమ్మ సంబరాలు.. సందడి చేసిన నవీన్ పోలిశెట్టి
V6 Velugu · V6 Velugu · 1 min read at V6 Velugu
పదివేల మందితో బతుకమ్మ పండుగ నిర్వహించి విదేశాల్లో ఉంటున్న తెలుగువారందరినీ ఆకర్షించిన తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డాలస్ (టీప్యాడ్).. ఈసారి కూడా 15వేల మందితో బతుకమ్మ వేడుకలను మరింత ఘనంగా నిర్వహించింది. అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో ఉన్న ఫ్రిస్కో నగరంలో ప్రతిష్టాత్మక ‘కొమెరికా సెంటర్’ వేదికగా ఈ వేడుకలు జరిగాయి. దాదాపు 15వేల మంది హాజరైన ఈ కార్యక్రమంలో వెయ్యి మందికి పైగా మహిళలు, యువతులు బతుకమ్మ ఆటపాటలతో కొమెరికా సెంటర్కు తెలంగాణ సంప్రదాయ పరిమళాలద్దారు.
అనంతరం శాస్త్రోక్తంగా బతుకమ్మలను నిమజ్జనం చేశారు. స్టేడియంలో భారీ బతుకమ్మను ఏర్పాటు చేయడం ఆకట్టుకుంది. కాగా.. కార్యక్రమంలో భాగంగా మహిషాసుర మర్దిని నృత్యరూపకాన్ని ప్రదర్శించారు. ఈ వేడుకలకు హాజరైన నటుడు నవీన్ పొలిశెట్టి.. తనదైన కామెడీ టైమింగ్ పంచులతో అదరగొట్టారు. అమెరికాలో బతుకమ్మను ఘనంగా నిర్వహించడం పట్ల ముగ్ధుడైన ఆయన.. టైమింగ్ పంచులతో, డ్యాన్సులతో ప్రాంగణాన్ని ఉర్రూతలూగించారు.
Excerpt. Full story at V6 Velugu: https://www.v6velugu.com/tpad-dallas-bathukamma-dasara-celebrations-2026-in-frisco-texas
framing not published · 1 outlet covered this story, below the floor for a split