PM Modi | కెనడాలో పర్యటించనున్న ప్రధాని మోదీ.. డిసెంబర్ 11, 12 తేదీల్లో షెడ్యూల్ ఖరారు
Namasthe Telangana · NT News telugu · 2 min read at Namasthe Telangana
PM Modi : భారత ప్రధాని నరేంద్ర మోదీ కెనడాలో పర్యటించబోతున్నారు. వచ్చే డిసెంబర్ 11, 12 తేదీల్లో ఆయన కెనడాలో పర్యటిస్తారని ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు కెనడా (ఒట్టావా)లోని భారత రాయబార కార్యాలయం శుక్రవారం దీనిపై ప్రకటన చేసింది. ప్రధాని పర్యటన ఖరారైందని తెలిపింది. మోదీ తన పర్యటనలో కెనడా ప్రధాని మార్క్ కార్నీతో భేటీ అవుతారు. ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఇరు దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి రెండు దేశాధినేతలు అంగీకరించారని భారత్ తెలిపింది.
మోదీ పర్యటన ద్వైపాక్షికంగా కీలక మలుపుగా అభివర్ణించింది. ఈ పర్యటనలో వ్యాపారం, వాణిజ్యం, ఎనర్జీ, టెక్నాలజీ, భద్రతతోపాటు పౌరుల సేవలు వంటి అంశాలపై మోదీ, కార్నీ చర్చిస్తారు. మోదీ పర్యటన గురించి కార్నీ కూడా ఇటీవల వెల్లడించారు. గురువారం ఆయన ఒక రెస్టారెంట్లో అక్కడి ప్రజలతో మాట్లాడుతూ మోదీ పర్యటనను ఖాయం చేశారు. అమెరికాకు పొరుగునే ఉన్న కెనడా.. ఇండియా వ్యాపారాలకు, ఇతర ద్వైపాక్షిక సంబంధాలకు చాలా కీలకం. ప్రస్తుతం అమెరికాతో వ్యాపారం, వాణిజ్యం విషయంలో ఇండియా పలు ఇబ్బందులు ఎదుర్కుంటోంది.
Excerpt. Full story at Namasthe Telangana: https://www.ntnews.com/national/pm-modi-to-visit-canada-from-december-11-heres-the-agenda-for-the-visit-as-new-delhi-ottawa-bolster-ties-2538168
framing not published · 3 outlets covered this story, below the floor for a split