పోచంపల్లి పీహెచ్సీలో మహిళా వైద్యురాలిపై వ్యక్తి దాడి
Namasthe Telangana · NT News telugu · 1 min read at Namasthe Telangana
భూదాన్ పోచంపల్లి, అక్టోబర్ 01 : డ్యూటీలో ఉన్న డాక్టర్, సిబ్బందిపై ఓ వ్యక్తి దాడి చేసి డాక్టర్ మెడలో ఉన్న స్టెతస్కోప్ తీసుకుని పోలీస్ స్టేషన్ కు పరారైన ఘటన గురువారం భూదాన్ పోచంపల్లిలో చోటుచేసుకుంది. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జిబ్లక్పల్లి పల్లె దావఖాన డాక్టర్ శ్వేత గురువారం విధులు నిర్వహిస్తున్నారు. పోచంపల్లి గ్రామానికి చెందిన దుద్యాల వెంకట తిరుపతి కాలికి గాయం కావడంతో చికిత్స చేయించుకునేందుకు హాస్పిటల్ కు వచ్చాడు. డాక్టర్ శ్వేత వద్దకు తిరుపతి వచ్చి కాలును చూపించడంతో కాలుకు పట్టి వేసి మందులు రాసిచ్చారు. కొద్దిసేపు తర్వాత తిరుపతి అనుచితంగా ప్రవర్తించి అకారణంగా డాక్టర్ పై దాడి…
మహిళా వైద్యాధికారిణిపై దుండగుడు దాడికి పాల్పడాటాన్ని నిరసిస్తూ వైద్య సిబ్బంది నల్ల బ్యాడ్జీలు ధరించి ఆస్పత్రి ఎదుట నిరసన వ్యక్తం చేశారు. పీహెచ్సీ వద్ద పోలీసులు రక్షణ కల్పించాలని, నిందితుడిపై చర్యలు తీసుకునేంత వరకు విధులు బహిష్కరిస్తామని వైద్య సిబ్బంది తెలిపారు. ఈ ఘటనపై పోలీస్ స్టేషన్ పై ఫిర్యాదు చేశారు. కాగా నిందితుడి మానసిక పరిస్థితి బాగాలేదని సమాచారం.
Excerpt. Full story at Namasthe Telangana: https://www.ntnews.com/nalgonda/yadadri/female-doctor-attacked-at-pochampally-phc-2525067
framing not published · 1 outlet covered this story, below the floor for a split