Polluted Cities | ప్రపంచ అత్యంత కాలుష్య నగరాలు.. ఒక్క భారత్‌లోనే ఎన్ని ఉన్నాయంటే..?
Namasthe Telangana · NT News telugu · 1 min read at Namasthe Telangana
Polluted Cities | న్యూఢిల్లీ : ప్రపంచంలోని అత్యంత కలుషిత నగరాల గ్లోబల్ ర్యాంకింగ్‌లో భారత్ నుంచే అత్యధికంగా ఉన్నాయి. ఈ గ్లోబల్ ర్యాంకింగ్ జాబితాలోని 20 నగరాల్లో 13 నగరాలు భారత్‌కు చెందినవే కావడం దేశంలో కాలుష్య స్థాయిని తెలియచేస్తున్నాయి. సోమవారం విడుదలైన ఈ గ్లోబల్ జాబితాలో వాయు కాలుష్యానికి అత్యధికంగా గురవుతున్న ఢిల్లీ లేకపోవడం గమనార్హం. సోమవారం మధ్యాహ్నం సుమారు 3.30 గంటలకు(భారత కాలమానం) గాలి నాణ్యత సూచీ(ఏక్యూఐ) నుంచి సేకరించిన సమాచారం ప్రకారం యూపీలోని బులంద్‌షహర్ ప్రపంచవ్యాప్తంగా 3వ స్థానంలో నిలిచింది. ఇక్కడ నమోదైన యూఎస్ ఏక్యూ విలువ 198గా ఉంది. దీన్ని ‘అనారోగ్యకరమైనది’(అన్‌హెల్తీ)గా…
త్రిపురలోని అగర్తల 181 ఏక్యూ విలువతో నాలుగవ స్థానంలో ఉంది. టాప్ 20 జాబితాలో ఉన్న ఇతర భారతీయ నగరాల్లో రాజస్థాన్‌లోని పాలి, ఉత్తర్‌ప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ ఉన్నాయి. ఈ రెండు నగరాల్లోనూ ఏక్యూఐ విలువ 174గా నమోదైంది. మధ్యప్రదేశ్‌లోని బుర్హన్‌పూర్‌లో కూడా 174 ఏక్యూఐ నమోదు కాగా, హర్యానాలోని రోహ్తక్లో 172 ఏక్యూఐ నమోదైంది. రాజస్థాన్‌లోని కోటాలో గాలి నాణ్యత సూచీ 170గా నమోదైంది. ఆ తర్వాతి స్థానాల్లో ముంబై(167), హాపుర్(166), హిస్సార్(165), బికనేర్(165), బరేలీ (164) ఉన్నాయి. ఈ గణాంకాలతో అత్యం త కాలుష్యంతో కూడిన పట్టణ ప్రాంతాల జాబితాలో ఈ నగరాలు చోటు సంపాదించుకున్నాయి.
Excerpt. Full story at Namasthe Telangana: https://www.ntnews.com/national/india-dominates-worlds-most-polluted-cities-list-with-13-cities-in-top-20-2540482
framing not published · 1 outlet covered this story, below the floor for a split