ప్రజలపై మళ్లీ గ్యాస్ పిడుగు
Namasthe Telangana · NT News telugu · 1 min read at Namasthe Telangana
న్యూఢిల్లీ, అక్టోబర్ 1: పండుగల ముంగిట కేంద్రం ప్రజలపై మరో పిడుగు వేసింది. 19 కిలోల వాణిజ్య సిలిండర్‌పై రూ.62.59 మేర పెంచింది. గత నెలలోనే రూ.9.50 మేర పెంచిన కేంద్రం తాజాగా మళ్లీ వడ్డించింది. గృహ అవసరాలకు వినియోగించే దేశీయ ఎల్పీజీ ధరలు యథాతథంగా ఉన్నాయి. మరోవైపు విమాన ఇంధనం(ఏటీఎఫ్) ధర లీటర్‌కు రూ.16 చొప్పున పెరిగింది. దేశీయ విమానయాన సంస్థలకు ఏటీఎఫ్ ధర లీటర్‌కు రూ.121 నుంచి రూ.137కు పెంచినట్టు చమురు కంపెనీలు వివరించాయి. ఆగస్టులో లీటర్‌కు రూ.5 పెంపు తర్వాత సెప్టెంబర్‌లో ఏటీఎఫ్ ధరలను లీటర్‌కు రూ.6.28 లేదా 5.46 శాతం పెంచిన నేపథ్యంలో ఈ తాజా సవరణ జరిగింది. విమానయాన సంస్థల నిర్వహణ వ్యయంలో ఏటీఎఫ్…
ఎల్పీజీ బుకింగ్‌కు ఆధార్ఈ-కేవైసీ తప్పనిసరి ఆధార్-ఈ-కేవైసీ ప్రక్రియను పూర్తి చేయని వినియోగదారులు గురువారం నుంచి(అక్టోబర్ 1) నుంచి నిర్ణీత ధరకు 14.2 కిలోల గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్‌ను బుక్ చేసుకోలేరు. దీనికి బదులుగా ఆ వినియోగదారులు 5 కిలోల ఫ్రీ ట్రేడ్ ఎల్పీజీ(ఎఫ్టీఎల్) లేదా 10 కిలోల కాంపోజిట్ ఫైబర్ సిలిండర్లను కొనుగోలు చేసే లేదా రీఫిల్ చేయించుకునే అవకాశం ఉంటుందని సబంధిత వర్గాల సమాచారం. వర్తించే సబ్సిడీతో నియంత్రిత రిటైల్ అమ్మకపు ధరకు సిలిండర్లు కొనే ఎల్పీజీ వినియోగదారులకు ఇప్పుడు బయోమెట్రిక్-ఆధార్ అథెంటికేషన్ తప్పనిసరి అనే కొత్త నిబంధన గురువారం నుంచి అమల్లోకి వచ్చింది.…
Excerpt. Full story at Namasthe Telangana: https://www.ntnews.com/news/commercial-lpg-and-aviation-fuel-prices-hiked-ahead-of-festive-season-2525203
framing not published · 1 outlet covered this story, below the floor for a split