ప్రమాదాలు జరిగిన పట్టించుకోరా..? రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలంటూ ధర్నా
Namasthe Telangana · NT News telugu · 1 min read at Namasthe Telangana
హత్నూర,అక్టోబర్18 : ధ్వంసమైన రోడ్డుపై ప్రయాణిస్తుంటే నిత్యం ఏదో ఒకచోట ప్రమాదాలు జరిగి గాయాల పాలవుతున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ సంగారెడ్డి జిల్లా హత్నూర మండల కేంద్రం ప్రధాన రహదారిపై ఆదివారం గ్రామస్తులు ధర్నా రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ దౌల్తాబాద్ నుండి హత్నూర ఐటిఐ వరకు 8 కిలోమీటర్ల మేర తారురోడ్డు పూర్తిగా ధ్వంసమై భారీ ఎత్తున గుంతలు పడ్డాయన్నారు. ధ్వంసమైన రోడ్డుపై నిత్యం వాహనదారులు ప్రమాదాలకు గురవుతూ గాయాల పలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల ఓ యువకుడు ద్విచక్ర వాహనంపై వెళుతూ రోడ్డుపై ఏర్పడ్డ గుంతలో పడి గాయాలపాలై చికిత్స పొందుతూ మృతి చెందాడని ఆవేదన వ్యక్తం…
నిత్యం ఆ రోడ్డు గుండా వెళ్లాలంటే ప్రయాణికులు జంకుతున్నారని ఆరోపించారు. అడుగడుగునా భారీ ఎత్తున గుంతలు పడడంతో గుంతలను తప్పించబోయి ద్విచక్ర వాహనదారులు అదుపుతప్పి కింద పడుతూ గాయాలపాలవుతున్నరని అయినా ప్రభుత్వం మరమ్మతులు చేపట్టడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకుపోయినా పట్టించుకోవడంలేదని ఇప్పటికైనా ఉన్నత అధికారులు స్పందించి రోడ్డుకు మరమ్మత్తు పనులు చేపట్టాలని కోరారు. విషయం తెలుసుకున్న హత్నూర పోలీసులు అక్కడకు చేరుకుని ధర్నా విరమింప చేశారు.
Excerpt. Full story at Namasthe Telangana: https://www.ntnews.com/medak/sangareddy/hatnoora-villagers-stage-a-protest-demanding-repairs-to-the-road-2539376
framing not published · 1 outlet covered this story, below the floor for a split