ప్రపంచ టాప్ శాస్త్రవేత్తల లిస్టులో డాక్టర్ పత్తిపాటి ఉషారాణి
Namasthe Telangana · NT News telugu · 1 min read at Namasthe Telangana
సిటీబ్యూరో, అక్టోబర్ 18 (నమస్తే తెలంగాణ ): ప్రపంచంలోని అగ్రగామి శాస్త్రవేత్తల జాబితాలో సీఎస్ఐఆర్-ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ), హైదరాబాద్ విశ్రాంత శాస్త్రవేత్త డాక్టర్ పత్తిపాటి ఉషారాణి చోటు సంపాదించారు. 2026 సంవత్సరానికి గానూ అంతర్జాతీయంగా పేరుపొందిన ‘టాప్ సైనెట్’ ప్రచురించిన ప్రపంచ టాప్ 2% శాస్త్రవేత్తల సింగిల్-ఇయర్ ర్యాంకింగ్లో ఆమె ఈ అరుదైన గుర్తింపును సొంతం చేసుకున్నారు. కీటకశాస్త్రం ఉపవిభాగంలో అంతర్జాతీయ స్థాయిలో ఆమె 341వ ర్యాంకును సాధించి దేశానికీ, విభాగానికీ పేరుప్రతిష్ఠలు తెచ్చారు. అమెరికాలోని ప్రముఖ స్టాన్ ఫోర్డ్ విశ్వవిద్యాలయం, ఎల్సెవియర్…
డాక్టర్ ఉషారాణి జీవశాస్త్ర రంగంలో, ముఖ్యంగా కీటకశాస్త్ర విభాగంలో సుదీర్ఘకాలం పాటు సేవలందించారు. రసాయన పర్యావరణ శాస్త్రం జీవ ఆధారిత పురుగు మందులు , నానోబయోటెక్నాలజీ విభాగాల్లో ఆమె వినూత్న పరిశోధనలు నిర్వహించారు. పర్యావరణానికి హాని కలిగించని, సుస్థిరమైన చీడపీడల నివారణ పద్ధతులను కనుగొనడంలో ఆమె కీలక పాత్ర పోషించారు.
Excerpt. Full story at Namasthe Telangana: https://www.ntnews.com/hyderabad/dr-pattipati-usharani-in-the-list-of-the-worlds-top-scientists-2539719
framing not published · 1 outlet covered this story, below the floor for a split