Punjagutta Temple: పంజాగుట్ట దుర్గాభవానీ గుడిలో సరస్వతీ దేవి అలంకారములో అమ్మవారు
Namasthe Telangana · NT News telugu · 1 min read at Namasthe Telangana
హైదరాబాద్: దేశవ్యాప్తంగా దేవీ నవరాత్రుల పర్వదినాలు వైభవంగా జరుగుతున్నాయి. మూలానక్షత్రం నేపథ్యంలో పలు ఆలయాల్లో ఇవాళ అమ్మవారు శ్రీ సరస్వతీ దేవి అలంకారములో దర్శనం ఇస్తున్నారు. హైదరాబాద్లోని పంజాగుట్టలో ఉన్న శ్రీ దుర్గాభవానీ ఆలయంలో .. అమ్మవారు ఇవాళ సరస్వతీ దేవిగా దర్శనం ఇస్తున్నారు. ఆరవ రోజు అత్యంత సుందరంగా అమ్మవారిని అలంకరించారు. ధవళ వస్త్రాల్లో అమ్మవారు .. చదువుల తల్లిగా భక్తులను ఆశీర్వదిస్తున్నారు. చిన్న పిల్లలకు ఇవాళ ఆలయంలో సరస్వతీ పూజ నిర్వహిస్తున్నారు. ఈ రోజు మధ్యాహ్నం ఆలయంలో అన్నవితరణ కార్యక్రమం కూడా ఉన్నది. ప్రధాన అర్చకులు…
శరన్నవరాత్రుల్లో శ్రీ సరస్వతీ దేవి అలంకారానికి ప్రత్యేకమైన విశిష్టత ఉంది. దేవీ నవరాత్రుల్లో ఆరో రోజున లేదా మూలా నక్షత్రం ఉన్న రోజున అమ్మవారిని చదువుల తల్లి సరస్వతీ దేవిగా అలంకరించి పూజిస్తారు. సరస్వతి దేవి జ్ఞానం, విద్య, సాహిత్యం, కళలు, సంగీతం, వివేకానికి అధిదేవత. అమ్మవారిని ఈ రూపంలో దర్శించుకుని ఆరాధిస్తే బుద్ధి వికాసం, వాగ్వైభవము, విద్యా లాభం కలుగుతాయి.
Excerpt. Full story at Namasthe Telangana: https://www.ntnews.com/news/goddess-durgadevi-in-saraswati-alankaram-at-punjagutta-durga-bhavani-temple-today-2537874
framing not published · 1 outlet covered this story, below the floor for a split