Rains | బంగాళాఖాతంలో అల్ప పీడనం.. మూడు రోజులు వర్షాలు..!
Namasthe Telangana · NT News telugu · 1 min read at Namasthe Telangana
Rains | బంగాళాఖాతంలో అల్ప పీడనం కారణంగా ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణకు మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉపరితల ఆవర్తనంతో పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముండగా.. కొన్ని చోట్ల పిడుగులు పడే అవకాశముందని గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశముందని వెల్లడించింది.
2 రోజులపాటు గ్రేటర్లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు ఇప్పటికే వెల్లడించారని తెలసిందే. వాతావరణంలో చోటుచేసుకుంటున్న మార్పుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచనలు చేస్తున్నారు.
Excerpt. Full story at Namasthe Telangana: https://www.ntnews.com/telangana/upcoming-23-days-rains-wil-be-come-in-telangana-2540740
framing not published · 1 outlet covered this story, below the floor for a split