రైతన్నపై ఆంక్షలు.. కాలువల్లో మోటర్లు వాడొద్దు.. నీళ్లు తోడొద్దు
Namasthe Telangana · NT News telugu · 2 min read at Namasthe Telangana
ఆదిలాబాద్, అక్టోబర్ 16 ( నమస్తే తెలంగాణ) : మూలిగే నక్కపై తాటికాయ పడిన చందంగా మారింది ఆదిలాబాద్ జిల్లా రైతుల పరిస్థితి. ఎల్ నినో నేపథ్యంలో రైతులు, ప్రజలు చెరువులు, కుంటలు, చెక్డ్యామ్లు, కాలువల్లో నీటిని మోటర్ల ద్వారా వినియోగించొద్దని నీటిపారుదల శాఖ అధికారులు ఆదేశాలు జారీచేశారు. ఒకవేళ వినియోగిస్తే తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీచేశారు. ఈ మేరకు ఆ ఆదేశాల కాపీలను తహసీల్దార్, ఎంపీడీవో, వ్యవసాయ, విద్యుత్తు శాఖ అధికారులకు వారు అందజేశారు. జిల్లాలో వానకాలంలో రైతులు 5.81 లక్షల ఎకరాల్లో పంటలు సాగుచేయగా 4.31లక్షల ఎకరాల్లో పత్తి పంటను పండించారు. కాయల నుంచి దూది విచ్చుకునే దశలో ఉన్న పత్తికి…
ఆదిలాబాద్ జిల్లాలో వానకాలం పత్తి పంట అధికంగా సాగువుతుంది. మరో 15 నుంచి 20 రోజుల్లో దూది పూర్తిగా విచ్చుకుంటుంది. డిసెంబర్ వరకు పంట పూర్తిస్థాయిలో చేతికి రానున్నది. ప్రస్తుతం జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం, సాయంత్రం వేళల్లో మంచు సైతం కురువడం లేదు. ప్రస్తుతం పత్తి చేలకు నీటి అవసరం ఉండగా, రైతులు తమకు సమీపంలోని చెరువులు, కుంటలు, వాగులు, చెక్డ్యామ్లు, కాలువల నుంచి కరెంటు మోటర్లు, ఆయిల్ ఇంజిన్ల ద్వారా నీటిని తమ పంట పొలాలకు మళ్లించుకుంటున్నారు. కరెంటు కోతలను సైతం తట్టుకొని భగీరథ ప్రయత్నాలు చేసి పత్తి పంటను కాపాడుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇలాంటి ఆపత్కాలంలో నీటిపారుదల శాఖ అధికారులు నీటి…
Excerpt. Full story at Namasthe Telangana: https://www.ntnews.com/telangana/irrigation-department-restricts-water-pumping-from-lakes-and-canals-in-adilabad-2538365
framing not published · 70 outlets covered this story, below the floor for a split