Ravana Dahan | రావణుడిని దహనం చేయని ఊరు.. ఈ శివాలయం వెనుక కథేంటి?
Namasthe Telangana · NT News telugu · 2 min read at Namasthe Telangana
Ravana Dahan | దేశవ్యాప్తంగా దసరా పండుగను చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకుంటారు. ఈ సందర్భంగా రావణుడి దిష్టిబొమ్మలను దహనం చేయడం అనేక ప్రాంతాల్లో ఆనవాయితీ. అయితే హిమాచల్‌ప్రదేశ్‌లోని కాంగ్రా జిల్లాలో ఉన్న బైజ్నాథ్ పట్టణం మాత్రం రావణ దహనం నిర్వహించరు. దీనికి కారణం అక్కడి పురాతన శివాలయం, రావణుడికి సంబంధించిన స్థానిక విశ్వాసాలే.
హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన కాంగ్రా (Kangra) జిల్లా అధికారిక వెబ్సైట్లో ఈ ఆలయం వెనుక ఉన్న చరిత్ర, స్థల పురాణం వివరించారు. దాని ప్రకారం.. శివుడిని ప్రసన్నం చేసుకునేందుకు రావణుడు హిమాలయాల్లో ఘోర తపస్సు చేశాడని చెబుతారు. పరమేశ్వరుడి అనుగ్రహం పొందాలనే సంకల్పతో రావణుడు తన తలలను ఒక్కొక్కటిగా సమర్పించేందుకు సిద్ధపడ్డాడు. దీంతో అతని అచంచల భక్తికి మెచ్చిన శివుడు ప్రతక్షమైన వరాలను ప్రసాదించాడు.. అప్పుడు శివుడిపై ఉన్న భక్తితో ఆయన్ను తన రాజ్యమైన లంకకు తీసుకెళ్లాలని రావణుడు కోరుకున్నాడు.. రావణుడి ఆ కోరిక మేరకు శివుడు లింగరూపంలో అతనితో వెళ్లేందుకు అంగీకరించాడు. అయితే ఆ ప్రయాణంలో శివలింగాన్ని…
Excerpt. Full story at Namasthe Telangana: https://www.ntnews.com/national/why-this-indian-town-does-not-burn-ravanas-effigy-on-dussehra-2540466
framing not published · 1 outlet covered this story, below the floor for a split