రేవంత్ సర్కార్లో అన్నీ స్కామ్లే.. కార్మికుల సొమ్మునూ వదలట్లే
Namasthe Telangana · NT News telugu · 1 min read at Namasthe Telangana
చిక్కడపల్లి, అక్టోబర్ 16 : రేవంత్ సర్కార్లో స్కీమ్లు లేవని అన్నీ స్కామ్లే ఉన్నాయని, ఆఖరికి కార్మికుల సొమ్మును కూడా వదల్లేదని బీఆర్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ మండిపడ్డారు. నిర్మాణరంగ కార్మికుల సంక్షేమానికి వినియోగించాల్సిన నిధులు పక్కదారి పడుతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. శుక్రవారం బీఆర్ఎస్ కార్మిక విభాగం బీఆర్టీయూ ఆధ్వర్యంలో ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని కార్మికశాఖ భవనం ఎదుట మహాధర్నాను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలనలో అవినీతి విచ్చలవిడిగా జరుగుతున్నదని, కుంభకోణాలకు నిలయంగా మారిందని విమర్శించారు.
కార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన ప్రభుత్వం, వారి ప్రయోజనాలు విస్మరించి నిధులు దారిమళ్లీస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. కార్మికశాఖలో రూ. 150 కోట్ల కుంభకోణం జరిగిందని, దానిపై చర్చకు మేము ఎక్కడికైనా సిద్ధమని, సీఎం రేవంత్రెడ్డి సిద్ధమా? అని సవాల్ విసిరారు. భవనరంగ కార్మికులకు కనీసం ఇన్సూరెన్స్ కూడా అందించలేని దుస్థితిలో ప్రభుత్వం ఉన్నదని, దీంతో సుమారు 15 లక్షల మంది కార్మికులకు అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తంచేశారు. పక్క రాష్ట్రంలో కార్మికులకు డైరెక్ట్ క్లెయిమ్ అవుతుందని, తెలంగాణలో మాత్రం దళారీ వ్యవస్థ కొనసాగుతున్నదని విమర్శించారు.
Excerpt. Full story at Namasthe Telangana: https://www.ntnews.com/telangana/brtu-alleges-%E2%82%B9150-crore-scam-in-telangana-labour-department-2538425
framing not published · 70 outlets covered this story, below the floor for a split