Revanth Reddy: అమరవీరుల కుటుంబాల సంక్షేమానికి ప్రాధాన్యం: సీఎం రేవంత్‌రెడ్డి
Eenadu · Eenadu · 2 min read at Eenadu
హైదరాబాద్: ప్రజల రక్షణ కోసం తమ ప్రాణాలను కోల్పోయిన అమరవీరుల కుటుంబాల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) అన్నారు. గోషామహల్ పరేడ్ మైదానంలో బుధవారం నిర్వహించిన పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో సీఎం పాల్గొన్నారు. అమరవీరుల స్థూపం వద్ద డీజీపీ సీవీ ఆనంద్‌తో కలిసి సీఎం నివాళుల్పించారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడారు. సమాజం కోసం ప్రాణాలర్పించిన వారిని స్మరించుకోవడం అందరి బాధ్యత అని సీఎం అన్నారు. ఈ ఏడాది 155 మంది పోలీసులు ప్రాణాలు కోల్పోవటం బాధాకరమన్నారు. శాంతిభద్రతలు బాగుంటేనే రాష్ట్రంలో అభివృద్ధి వేగంగా జరుగుతుందన్నారు. కొత్త సవాళ్లకు…
‘‘పోలీసు శాఖను బలోపేతం చేసేందుకు మా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 4,773 కానిస్టేబుల్ సహా మొత్తం 7,437 పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చాం. 2028 నాటికి పోలీసు శాఖలో అన్ని ఖాళీలను విడతల వారీగా భర్తీ చేస్తాం. 112 మంది డీఎస్పీలను డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేశాం. ఈ శాఖలో ఎక్స్‌గ్రేషియాను హోదాను బట్టి రూ.కోటికి పైగా పెంచాం. దేశానికి సేవ చేసిన వారిని గుర్తించడంతో పాటు వారి కుటుంబాల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్నాం. పోలీసు ఉద్యోగుల పిల్లల కోసం ప్రత్యేకంగా అంతర్జాతీయ స్థాయిలో స్కూల్‌ను ఏర్పాటు చేశాం. హోంగార్డుల కుటుంబాలకు వైద్య భద్రత కల్పించే చర్యలు చేపట్టాం. పోలీసు శాఖలో టెక్నాలజీ ఎంత పెరిగినా మానవీయ…
Excerpt. Full story at Eenadu: https://www.eenadu.net/telugu-news/telangana/cm-revanth-reddy-speech-in-police-commemoration-day/1801/126190753
framing not published · 1 outlet covered this story, below the floor for a split