Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్‌ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Namasthe Telangana · NT News telugu · 1 min read at Namasthe Telangana
Road Accident | హైదరాబాద్ హయత్‌నగర్‌లోని విజయవాడ జాతీయ రహదారిపై థార్ కారు బీభత్సం సృష్టించింది. వేగంగా దూసుకొచ్చిన థార్ కారు వెనుక నుంచి బైక్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. నాలుగేళ్ల చిన్నారి తీవ్రంగా గాయపడింది.
వివరాల్లోకి వెళ్తే.. ఎల్బీ నగర్లో నివాసం ఉంటున్న రేఖ తన నాలుగేళ్ల కుమార్తెను తీసుకుని తన సోదరుడు నవీన్‌తో కలిసి పెద్ద అంబర్‌పేటలోని పుట్టింటికి బయల్దేరింది. బైక్‌పై బయల్దేరిన వారు హయత్‌నగర్‌కు చేరుకోగానే.. వేగంగా వచ్చిన థార్ కారు వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో రేఖ, నవీన్ అక్కడికక్కడే మృతిచెందారు. నాలుగేళ్ల చిన్నారి తీవ్రంగా గాయపడింది. ఇది గమనించిన స్థానికులు 108 సాయంతో చిన్నారిని ఆస్పత్రికి తరలించారు.
Excerpt. Full story at Namasthe Telangana: https://www.ntnews.com/hyderabad/two-died-after-thar-hits-two-wheeler-in-hayath-nagar-2539506
framing not published · 5 outlets covered this story, below the floor for a split