Rob Jetten | తండ్రి కాబోతున్న తొలి గే ప్రధాని.. 2027లో కలుద్దాం అంటూ భావోద్వేగ పోస్టు!
Namasthe Telangana · NT News telugu · 1 min read at Namasthe Telangana
Rob Jetten | ప్రపంచంలోనే తొలి స్వలింగ సంపర్క ప్రధానిగా చరిత్ర సృష్టించిన రాబ్ జెట్టెన్ వ్యక్తిగత జీవితంలోనూ ఓ మధుర ఘట్టం ఆవిష్కృతం కానుంది. నెదర్లాండ్స్ ప్రధాని రాబ్ జెట్టెన్ (39), ఆయన భాగస్వామి, అర్జెంటీనా అంతర్జాతీయ హాకీ క్రీడాకారుడు నికోలస్ కీనన్ త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నారు. సరోగసీ (అద్దె గర్భం) ద్వారా తమకు తొలి బిడ్డ జన్మించబోతున్నట్లు ఈ జంట తాజాగా వెల్లడించింది. 2027లో తమ జీవితాల్లోకి చిన్నారి రాబోతున్నట్లు సోషల్ మీడియాలో ఆనందాన్ని పంచుకుంది.
‘‘మా జీవితాల్లోకి ఓ ప్రత్యేకమైన వ్యక్తి రాబోతున్నారు. చిన్నారి.. 2027లో కలుద్దాం. మా అండదాతకు, సరోగసీ తల్లి లీసాకు, వారి కుటుంబాలకు కృతజ్ఞతలు చెప్పడానికి మాటలు సరిపోవడం లేదు’’ అంటూ రాబ్ జెట్టెన్, నికోలస్ కీనన్ ఇన్స్టాగ్రామ్లో భావోద్వేగ పోస్టు చేశారు. కాగా, నెదర్లాండ్స్లోనే ఐవీఎఫ్ (IVF) చికిత్స ద్వారా గర్భధారణ ప్రక్రియ పూర్తయిందని, దేశ నిబంధనలకు అనుగుణంగానే ఈ ఏర్పాట్లు జరిగినట్లు జెట్టెన్ పార్టీ డెమోక్రాట్స్ 66 (D66) వెల్లడించింది.
Excerpt. Full story at Namasthe Telangana: https://www.ntnews.com/international/worlds-first-openly-gay-dutch-pm-rob-jetten-expecting-first-child-through-surrogacy-2540957
framing not published · 1 outlet covered this story, below the floor for a split