రూబియో టూర్ పై రాహుల్ వ్యంగ్యం..విదేశాంగశాఖ అధికారుల్లో గందరగోళం నెలకొందని ఎద్దేవా
V6 Velugu · V6 Velugu · 1 min read at V6 Velugu
న్యూఢిల్లీ: అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో భారత పర్యటన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. రూబియో టూర్‌పై భారత విదేశాంగ శాఖ (ఎంఈఏ) అధికారులకే ఎలాంటి స్పష్టత లేదని.. అసలు ఏం జరుగుతుందో అర్థంకాక ఆఫీసర్లంతా గందరగోళానికి గురవుతున్నారని సెటైర్లు వేశారు.
శుక్రవారం రాహుల్.. విదేశాంగ మంత్రి జైశంకర్‌ను పరోక్షంగా టార్గెట్ చేస్తూ ట్వీట్ చేశారు. ‘రూబియో తన సిబ్బందిని (జైశంకర్‌ను) ముంబైకి రావాలని ఆదేశించారు. మోదీజీ.. అసలు ఏం జరుగుతుందో విదేశాంగ శాఖలోని మీ అధికారులకు అర్థంకాక గందరగోళానికి గురవుతున్నారు.
Excerpt. Full story at V6 Velugu: https://www.v6velugu.com/rahul-gandhi-cryptic-post-over-rubio-mumbai-visit
framing not published · 1 outlet covered this story, below the floor for a split