సంగీత దర్శకుడు దేవా కుటుంబంలో మరో విషాదం.. 37 ఏళ్లకే నటుడు కార్తీక్ సబేష్ కన్నుమూత!
V6 Velugu · V6 Velugu · 2 min read at V6 Velugu
తమిళ చిత్ర పరిశ్రమలో వరుస విషాదాలు తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి.. ప్రముఖ సంగీత దర్శకుడు దేవా మరణంతో తీవ్ర దుఃఖంలో మునిగిపోయిన ఆయన కుటుంబాన్ని మరో విషాదం కుదిపేసింది. దేవా సోదరుడు, దివంగత సంగీత దర్శకుడు ఎంసీ సబేష్ కుమారుడు, నటుడు కార్తీక్ సబేష్ (37) కన్నుమూశారు.. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిశారు. వరుస మరణాలతో ఆ కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.
దేవా మరణవార్తతో తమిళ సినీ పరిశ్రమలో విషాదం నెలకొన్న సంగతి తెలిసిందే. ఆయనకు నివాళులర్పించేందుకు రాజకీయ, సినీ ప్రముఖులు తరలివచ్చారు. ముఖ్యమంత్రి విజయ్‌తో పాటు సూపర్‌స్టార్ రజనీకాంత్, కమల్ హాసన్ తదితరులు దేవా కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపం తెలిపారు. ఈ విషాదం నుంచి కుటుంబ సభ్యులు తేరుకోకముందే కార్తీక్ సబేష్ మరణవార్త మరింత బాధాకరంగా మారింది. కార్తిక్ సబేష్కు భార్య రమ్య కార్తిక్, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆయన మృతి సినీ వర్గాల్లో విషాదాన్ని నింపింది.
Excerpt. Full story at V6 Velugu: https://www.v6velugu.com/tamil-cinema-mourns-again-actor-karthik-sabesh-dies-at-37-after-music-director-deva
framing not published · 1 outlet covered this story, below the floor for a split