సర్కార్ నిర్లక్ష్యంతోనే ఎల్ నినో సంక్షోభం
Namasthe Telangana · NT News telugu · 1 min read at Namasthe Telangana
హైదరాబాద్, అక్టోబర్ 19 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో నెలకొన్న తీవ్ర కరువు, ఎల్ నినో పరిస్థితులు ప్రకృతి వైపరీత్యం కాదని, ముమ్మాటికీ కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలనా వైఫల్యం, నిర్లక్ష్యం వల్ల ఏర్పడిన మానవ తప్పిదమేనని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ మండిపడ్డారు. వాతావరణశాఖ ఏప్రిల్లోనే హెచ్చరించినప్పటికీ ఆరు నెలలపాటు నిద్రపోయిన ప్రభుత్వం, వర్షాకాలం ముగిసి పంటలు ఎండిపోయాక జీవో నంబర్ 1523 ద్వారా క్యాబినెట్ సబ్ కమిటీని వేయడం ప్రజలను మోసం చేయడమేనని విమర్శించారు. కేసీఆర్పై రాజకీయ కక్షతో కాళేశ్వరం ప్రాజెక్టును బద్నాం చేస్తూ 1,000 టీఎంసీలకు పైగా ప్రాణహిత వరద నీటిని సముద్రంపాలు…
జీవో నం. 1523లో నివేదిక సమర్పించడానికి ఎటువంటి గడువుగానీ, కరువు సహాయక చర్యల కోసం బడ్జెట్గానీ కేటాయించలేదని, జలాశయాలు అడుగంటి తీవ్ర నీటిఎద్దడి నెలకొన్న తరుణంలో జిల్లాలకు కేవలం రూ. కోటి కేటాయించడం సిగ్గుచేటని శ్రవణ్ పేరొన్నారు. బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రభుత్వం ముందు ఐదు కీలక డిమాండ్లను ఉంచారు. సబ్ కమిటీకి 15 రోజుల గడువు విధించి తగిన నిధులు సమకూర్చాలని, కరువు పరిస్థితులపై చర్చించేందుకు వెంటనే ఉభయ సభల ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేసి రూ. 20,000 కోట్ల అత్యవసర సప్లిమెంటరీ బడ్జెట్ను ఆమోదించాలని కోరారు. అలాగే కరువు ఖర్చులు, నీటి వృథా, విద్యుత్ కొనుగోళ్లపై సమగ్ర శ్వేతపత్రం విడుదల చేయడంతోపాటు…
Excerpt. Full story at Namasthe Telangana: https://www.ntnews.com/telangana/brs-mlc-dasoju-sravan-blames-congress-government-for-telangana-drought-2540589
framing not published · 1 outlet covered this story, below the floor for a split