సీఈసీ, ఎన్నికల కమిషనర్ల నియామకంపై.. సుప్రీంకోర్టుకు ఆర్జేడీ ఎంపీ మనోజ్ కుమార్
V6 Velugu · V6 Velugu · 2 min read at V6 Velugu
చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (CEC) , ఎన్నికల కమిషనర్ల నియామకం, వారికి కల్పించిన జీవితకాల రక్షణకు (Lifelong Immunity) వ్యతిరేకంగా RJD రాజ్యసభ ఎంపీ మనోజ్ ఝా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ఇతర ఎన్నికల కమిషనర్ల నియామక చట్టం-2023 లోని సెక్షన్ 16ను సవాలు చేస్తూ ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఈ చట్టం ద్వారా ఎన్నికల కమిషనర్లకు కల్పించిన పూర్తి రక్షణ రాజ్యాంగ విరుద్ధమని, ఇది రాజ్యాంగాన్ని వంచించడమే అని మనోజ్ ఝా తన పిటిషన్లో పేర్కొన్నారు.
రాష్ట్రపతి, గవర్నర్లు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు కూడా లభించని జీవితకాల రక్షణను ఎన్నికల కమిషనర్లకు ఈ చట్టంలోని సెక్షన్ 16 ద్వారా కల్పిస్తోందని మనోజ్ కుమార్ పిటిషన్ లో పేర్కొన్నారు. సుప్రీంకోర్టు సిట్టింగ్ , రిటైర్డ్ జడ్జీలను కూడా తగిన అనుమతులతో ప్రాసిక్యూట్ చేసే అవకాశం ఉంటుందని, అయితే పదవీ విరమణ చేసిన ఎన్నికల కమిషనర్లపై ఎలాంటి క్రిమినల్, సివిల్ చర్యలు తీసుకోకుండా ఈ చట్ట సవరణ ద్వారా శాశ్వత రక్షణ కల్పించారని అభ్యంతరం వ్యక్తం చేశారు.
Excerpt. Full story at V6 Velugu: https://www.v6velugu.com/rjd-mp-manoj-jha-moves-supreme-court-against-lifelong-immunity-for-election-commissioners
framing not published · 1 outlet covered this story, below the floor for a split