Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
Namasthe Telangana · NT News telugu · 1 min read at Namasthe Telangana
హనుమకొండ చౌరస్తా : చారిత్రక రుద్రేశ్వరస్వామి వేయిస్తంభాల దేవాలయంలో (Thousand Pillar Temple ) శ్రీ రుద్రేశ్వరీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి . 8వ రోజు రుద్రేశ్వరీదేవిని దుర్గాదేవిగా అలంకరించారు. కోన శ్రీకర్ దంపతులు అందించిన వివిధ రకాల కూరగాయలతో అమ్మవారిని శాకాంబరీదేవి ( Shakambari Devi ) గా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. యాగశాలలో శ్రీలక్ష్మీ దుర్గ సరస్వతియుక్త 18 అధ్యాయాలతో మహా చండీయాగం నిర్వహించారు.
అనంతరం సద్దుల బతుకమ్మ పల్లకిలో ప్రతిష్టించిన రుద్రేశ్వరిదేవిని అశ్వవాహనంపై పల్లకిసేవ నిర్వహించారు. నిత్యాన్నదానంలో భాగంగా మహా ప్రసాద వితరణ, వేలాదిమంది భక్తులు తీర్థప్రసాదాలు, అన్నప్రసాదం స్వీకరించారు. సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా కూచిపూడి నృత్య ప్రదర్శనలు నిర్వహించారు.
Excerpt. Full story at Namasthe Telangana: https://www.ntnews.com/warangal-rural/goddess-rudreshwari-at-the-thousand-pillar-temple-appears-as-shakambari-devi-2539541
framing not published · 2 outlets covered this story, below the floor for a split