Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
Namasthe Telangana · NT News telugu · 1 min read at Namasthe Telangana
Sheikh Hasina : భారత ప్రభుత్వానికి (Indian Govt), ప్రజలకు బంగ్లాదేశ్ మాజీ ప్రధాని (Bangladesh Ex PM) షేక్ హసీనా (Sheikh Hasina) కృతజ్ఞతలు తెలియజేశారు. 1975లో మాదిరిగానే భారత్‌లో తనను ఆదరించారని ఆమె ఉద్వేగానికి లోనయ్యారు. ఈ మేరకు అంతర్జాతీయ మీడియా సంస్థతో హసీనా వర్చువల్‌గా మాట్లాడారు. అదేవిధంగా వచ్చే డిసెంబర్లో బంగ్లాదేశ్‌కు తిరిగి వెళ్లాలన్న తన నిర్ణయంలో మార్పు లేదని చెప్పారు. అక్కడ వాళ్లు తనను చంపినా, హింసించినా తిరిగి వెళ్లడం తన బాధ్యత అన్నారు.
కాగా, 1975 ఆగస్టులో జరిగిన సైనిక తిరుగుబాటు హసీనా జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. నాటి ఘర్షణల్లో హసీనా తండ్రి, బంగ్లాదేశ్ తొలి అధ్యక్షుడు షేక్ ముజిబుర్ రెహమాన్, తల్లి, ముగ్గురు సోదరులు ఇంకా ఇతర కుటుంబసభ్యులు హత్యకు గురయ్యారు. ఆ సమయంలో విదేశాల్లో ఉండటంవల్ల హసీనా, ఆమె చిన్న చెల్లెలు రెహానా మాత్రమే బతికి బయటపడ్డారు. ఆ క్లిష్ట సమయంలో నాటి భారత ప్రధాని ఇందిరాగాంధీ ఆమెకు ఆశ్రయం ఇచ్చారు. ఆరు సంవత్సరాల తర్వాత 1981 మేలో బంగ్లాదేశ్‌కు హసీనా తిరిగివెళ్లి ఆ దేశ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించారు.
Excerpt. Full story at Namasthe Telangana: https://www.ntnews.com/international/i-may-be-killed-sheikh-hasina-vows-to-return-to-bangladesh-despite-death-sentence-2540773
framing not published · 1 outlet covered this story, below the floor for a split