శ్రీ రామలింగేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్‌ను సత్వరమే పూర్తి చేయాలి : మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్
Namasthe Telangana · NT News telugu · 2 min read at Namasthe Telangana
గుర్రంపోడు, అక్టోబర్ 16 : కాంగ్రెస్ ప్రభుత్వం ముందు చూపు లేని కారణంగా రాష్ట్రంలో గడ్డు పరిస్థితులు తలెత్తాయని నాగార్జున సాగర్ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ అన్నారు. రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వంపై నమ్మకం పోయిందన్నారు. శుక్రవారం గుర్రంపోడు మండలం పోచంపల్లి గ్రామానికి చెందిన బైరు అశ్విని సాగునీరు రాక, కరెంటు లేక తమ గ్రామంలో వేసిన వరి చేలు, పండ్ల తోటలు ఎండిపోతున్నాయని, పంటలను కాపాడుకునేందుకు తమ నాన్నతో పాటు, తమ నాన్న లాంటి నాన్నలు ఎంతో కష్టపడుతున్నారని, వాళ్ల కష్టం చూసి ఒక ఆడబిడ్డగా తాను తట్టుకోలేకపోతున్నానని, తమకు న్యాయం చేయండి అన్నా అంటూ బీఆర్ఎస్ వర్కింగ్…
ఈ పోస్టుకు స్పందించిన కేటీఆర్ ఆదేశాల మేరకు నోముల భగత్ కుమార్ పోచంపల్లి గ్రామానికి వెళ్లి బైరు అశ్విని కుటుంబ సభ్యులను కలిసి వారి సమస్యను ఆలకించారు. వేసిన నాలుగు ఎకరాల పొలంలో రెండు ఎకరాలు ఇప్పటికే పూర్తిగా ఎండిపోయిందని, మరో ఆరు ఎకరాల తోట కూడా నీరు లేక వాడు బట్టి పోతుందని తెలిపారు. దీనిపై నోముల మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ముందుచూపు లేకపోవడంతో రాష్ట్రంలో గడ్డు పరిస్థితి ఏర్పడిందని, రాబోయే కాలంలో ఈ పరిస్థితి మరింత తీవ్రంగా ఉంటుందన్నారు. రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్టు నీటిని ఏ విధంగా వాడుకోవాలో, కరెంటు ఏ విధంగా వాడుకోవాలో కేసీఆర్‌కు తెలిసినంతగా రాష్ట్రంలో మరెవరికి తెలువదన్నారు. వేలకు వేలు…
Excerpt. Full story at Namasthe Telangana: https://www.ntnews.com/nalgonda/difficult-situation-in-the-state-due-to-the-govts-lack-of-foresight-2538165
framing not published · 1 outlet covered this story, below the floor for a split