సికింద్రాబాద్ కంటోన్మెంట్లో కూల్చివేతలు.. కేజేఆర్, వైస్రాయ్ గార్డెన్లు నేలమట్టం
V6 Velugu · V6 Velugu · 1 min read at V6 Velugu
సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలో కంటోన్మెంట్ అధికారులు కూల్చివేత చర్యలు చేపట్టారు. బంగ్లా నంబర్ 218 పరిధిలో ఉన్న కేజేఆర్ గార్డెన్, వైస్రాయ్ గార్డెన్లలోని నిర్మాణాలను అధికారులు తొలగించారు. ఈరోజు ఉదయం నుంచి కూల్చివేత పనులు ప్రారంభించిన అధికారులు, అక్రమ నిర్మాణాలను తొలగించే ప్రక్రియను కొనసాగించారు.
బంగ్లా నంబర్ 218కు సంబంధించిన స్థలంపై గత 30 సంవత్సరాలుగా కోర్టులో వివాదం కొనసాగుతోంది. ఇటీవల ఈ కేసును కోర్టు కొట్టివేయడంతో కంటోన్మెంట్ అధికారులు చర్యలకు సిద్ధమయ్యారు. ముందుగా సంబంధిత వారికి నోటీసులు జారీ చేసి, అనంతరం కూల్చివేత పనులను చేపట్టారు.
Excerpt. Full story at V6 Velugu: https://www.v6velugu.com/demolition-of-kjr-and-viceroy-gardens-in-secunderabad-cantonment
framing not published · 1 outlet covered this story, below the floor for a split