సింగరేణి అధికారులకు దసరా కానుక..కోల్ ఇండియా తరహా వేతనాల పెంపునకు సింగరేణి ఉత్తర్వులు
V6 Velugu · V6 Velugu · 1 min read at V6 Velugu
హైదరాబాద్, వెలుగు: కోలిండియా తరహా వేతనాలను అమలు చేస్తూ సింగరేణి యాజమాన్యం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. పెండింగ్లో ఉన్న ఈ సమస్యను పరిష్కరిస్తూ సింగరేణి అధికారులకు దసరా కానుక అందించినట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. పెరిగిన వేతనాలను అక్టోబర్ నెల జీతాల నుంచి చెల్లించనున్నట్లు తెలిపారు. ఈ నిర్ణయంతో ఎగ్జిక్యూటివ్ క్యాడర్–1 నుంచి ఎగ్జిక్యూటివ్ క్యాడర్–7 వరకు ఉన్న సుమారు 1,800 మంది అధికారులకు ప్రయోజనం చేకూరనుంది. సవరించిన బేసిక్ వేతనాలు 2017 జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి. కాగా, ఆర్థిక ప్రయోజనాలు సింగరేణి బోర్డు ఆమోదం తెలిపిన 2026 సెప్టెంబర్ 25 నుంచి…
కోలిండియాలో వేతన అసమానతల నేపథ్యంలో, మహారత్న సంస్థల వేతన విధానాన్ని తమకూ అమలు చేయాలని అక్కడి అధికారులు కోరారు. ఈ ప్రతిపాదనకు కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ, కోలిండియా యాజమాన్యం ఆమోదం తెలిపాయి. ఇదే విధానాన్ని సింగరేణిలోనూ అమలు చేయాలని సంస్థ అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం, దసరాలోపు చర్యలు తీసుకోవాలని ఈ ఏడాది జులైలో సింగరేణి యాజమాన్యాన్ని ఆదేశించింది. దీంతో ఈ అంశంపై యాజమాన్యం కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ నివేదిక ఆధారంగా వేతనాల పెంపుపై నిర్ణయం తీసుకుంది.
Excerpt. Full story at V6 Velugu: https://www.v6velugu.com/singareni-officers-get-dussehra-gift-as-sccl-issues-coal-india-aligned-wage-hike-orders
framing not published · 1 outlet covered this story, below the floor for a split