సొసైటీల నిధులపై కాంగ్రెస్ కన్ను
Namasthe Telangana · NT News telugu · 1 min read at Namasthe Telangana
హైదరాబాద్/మేడ్చల్, అక్టోబర్ 16 (నమస్తే తెలంగాణ): సొసైటీల్లోని నిధులపై కాంగ్రెస్ పెద్దల కన్నుపడిందని, సహకార సంఘాల పాలకవర్గ నామినేటెడ్ పద్ధతిని న్యాయవ్యవస్థ ద్వారా అడ్డుకొని తీరుతామని సంఘాల చైర్మన్లకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హామీ ఇచ్చారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన సొసైటీ చైర్మన్లు తెలంగాణ భవన్లో శుక్రవారం కేటీఆర్ను కలిశారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం సహకార సంఘాలకు నామినేటెడ్ పద్ధతిలో పాలకవర్గాన్ని ఏర్పాటు చేయడం సరికాదని చెప్పారు.
బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ కృషి వల్లే సహకార సంఘాలు అభివృద్ధి చెందాయని గుర్తుచేశారు. తెలంగాణ ఏర్పడిన సమయంలో సహకార సంఘాల్లో రూ.13 వేల కోట్లు ఉంటే తొమ్మిదిన్నరేండ్ల బీఆర్ఎస్ పాలనలో 73 వేల కోట్ల నిధులకు చేరాయని తెలిపారు. సహకార సంఘాల సభ్యులు, రైతులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 908 సొసైటీల్లో రూ.కోటి నుంచి రూ.50 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయని, ఆ నిధులపై కాంగ్రెస్ పెద్దల కన్ను పడిందని ఆరోపించారు. రాష్ట్రంలోని సహకార సంఘాలు, సహకార బ్యాంకులకు వెంటనే ఎన్నికలు నిర్వహించేలా కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కేటీఆర్ను ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల…
Excerpt. Full story at Namasthe Telangana: https://www.ntnews.com/telangana/ktr-accuses-congress-of-eyeing-cooperative-society-funds-2538467
framing not published · 70 outlets covered this story, below the floor for a split