స్థానిక సంస్థల ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలి
Eenadu · Eenadu · 2 min read at Eenadu
విజయనగరం రూరల్: స్థానిక సంస్థల ఎన్నికల విధుల నిర్వహణలో అధికారులు, ఉద్యోగులు అప్రమత్తంగా సమన్వయంతో వ్యవహరించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. ఎన్నికల ప్రక్రియలో ప్రతి దశను నిబంధనలకు అనుగుణంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ముందస్తు ప్రణాళికతో పనిచేయాలని సూచించారు. బుధవారం కలెక్టరేట్లోని ఎన్నికల కంట్రోల్ రూమ్ సిబ్బందితో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఎన్నికల విధులు, బాధ్యతలు, పర్యవేక్షణ, సమాచార సేకరణ, నివేదికల సమర్పణ తదితర అంశాలపై ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణ అనేక దశలతో కూడిన కీలకమైన ప్రక్రియ అని, ప్రతి దశలోనూ ఎన్నికల…
ఎన్నికలకు సంబంధించిన విధుల కేటాయింపు, సిబ్బంది నియామకం, శిక్షణ, ఎన్నికల సామగ్రి సమీకరణ, రవాణా ఏర్పాట్లు, పోలింగ్ కేంద్రాల్లో మౌలిక సదుపాయాల కల్పన వంటివాటిని కంట్రోల్ రూమ్ ద్వారా పర్యవేక్షించాలని సూచించారు. దీనికోసం ఒక చెక్లిస్టును రూపొందించుకోవాలని చెప్పారు. ఓటర్ల జాబితాలు, పోలింగ్ కేంద్రాల వివరాలు, ఎన్నికల సిబ్బంది విధుల కేటాయింపు, శిక్షణ కార్యక్రమాలు, ఎన్నికల సామగ్రి పంపిణీ, పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది తరలింపు, బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్లు, స్ట్రాంగ్ రూమ్ల ఏర్పాటు వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. పోలింగ్ సిబ్బంది, సెక్టార్ అధికారులు, రిటర్నింగ్ అధికారులు, సహాయ…
Excerpt. Full story at Eenadu: https://www.eenadu.net/telugu-news/districts/vizianagaram-news/12/126186559
framing not published · 1 outlet covered this story, below the floor for a split