తాగునీటికి ఇబ్బంది రానివ్వం... తాత్కాలికంగా దుమ్ముగూడెం ఆనకట్ట ఎత్తును పెంచుతాం: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
V6 Velugu · V6 Velugu · 1 min read at V6 Velugu
మణుగూరు/ జూలూరుపాడు/ దమ్మపేట, వెలుగు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం దుమ్ముగూడెం ఆనకట్ట ఎత్తు పెంచి తాగునీటికి ఇబ్బందులు రాకుండా చూస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. సోమవారం పినపాక ఎమ్మెల్యే, ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్మన్ పాయం వెంకటేశ్వర్లుతో కలిసి సీతారామ ప్రాజెక్టును సందర్శించి నీటి నిల్వలను పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దుమ్ముగూడెం ఆనకట్ట నీటి నిల్వ సామర్థ్యం 0.8 టీఎంసీలకు గాను 0.5 టీఎంసీల నీటిని మాత్రమే నిల్వ చేసుకునే అవకాశం ఉందని, ఆనకట్ట వద్ద ఒక మీటరు ఎత్తు వరకు ఇసుక బస్తాలను ఏర్పాటు చేసి నీటి నిల్వను పెంచే అవకాశాలను పరిశీలించాలని ఇంజినీరింగ్ ఆఫీసర్లకు సూచించారు.
Excerpt. Full story at V6 Velugu: https://www.v6velugu.com/thummala-nageswara-rao-comments-on-dummugudem-barrage-hieght
framing not published · 1 outlet covered this story, below the floor for a split