టీజీ ఐపాస్‌తో వేగంగా అనుమతులిస్తాం
Namasthe Telangana · NT News telugu · 1 min read at Namasthe Telangana
హైదరాబాద్, అక్టోబర్ 16 (నమస్తే తెలంగాణ) : తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని కర్ణాటక పారిశ్రామికవేత్తలకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పిలుపునిచ్చారు. ఈ మేరకు శుక్రవారం బెంగళూరులో నిర్వహించిన ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026’ రోడ్‌షో కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. పారిశ్రామిక రంగంలో కర్ణాటక అద్భుతంగా రాణిస్తున్నదని, తెలంగాణలో సైతం భాగస్వామ్యాన్ని నెలకొల్పాలని కోరారు. రెండు రాష్ర్టాల మధ్య పారిశ్రామిక రంగంలో ఉన్న అనుబంధాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ క్రమంలోనే బెంగళూరులో డిజైన్ చేసిన విమాన ఇంజిన్లు హైదరాబాద్ ఏరోస్పేస్…
తెలంగాణ పత్తిని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కుల్లో నూలుగా వడికిన తర్వాత బెంగళూరు ఉత్పాదకదారులు అంతర్జాతీయ వస్త్ర పరిశ్రమల కోసం వినియోగిస్తున్నట్టు వివరించారు. కాగా, అంతర్జాతీయ కంపెనీలు తమ పరిశ్రమల ఏర్పాటుకు మొదట బెంగళూరునే ఎంచుకుంటున్నాయని మంత్రి చెప్పడం గమనార్హం. కానీ హైదరాబాద్‌లోనూ ఐఐఎస్సీ, ఐఐటీ హైదరాబాద్, ఐఎస్బీఈ, ఐఐఐటీల్లో ప్రతిభగల యువత ఉన్నారని చెప్పుకొచ్చారు. ఇక స్టార్టప్‌లకు టీ-హబ్ వేదికగా ఉందని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే గడిచిన పన్నెండేండ్లలో హైదరాబాద్ ప్రపంచస్థాయి సాంకేతిక నగరంగా ఎదిగిందన్నారు. జీనోమ్ వ్యాలీ లైఫ్‌సైన్సెస్ పవర్ హౌస్‌గా రూపాంతరం చెందిందని గుర్తుచేశారు. టీజీ…
Excerpt. Full story at Namasthe Telangana: https://www.ntnews.com/business/telangana-invites-karnataka-investors-to-invest-in-hyderabad-and-across-the-state-2538352
framing not published · 1 outlet covered this story, below the floor for a split