తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు ముఖ్య గమనిక.. ఇకపై ఫస్ట్ ఇయర్‌లోనూ ఇంటర్నల్ మార్కుల విధానం
V6 Velugu · V6 Velugu · 1 min read at V6 Velugu
తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు ఇంటర్ బోర్డ్ కీలక సూచన చేసింది. 2026-27 విద్యా సంవత్సరం నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లోనూ ఇంటర్నల్ మార్కుల విధానం ఉంటుందని ప్రకటించింది. 80 మార్కులకు థియరీ కాగా, 20 మార్కులు ఇంటర్నల్‌కు కేటాయించారు. ప్రస్తుతం సీబీఎస్ఈలో అన్ని సబ్జెక్టులకు ఇంటర్నల్ విధానం అమలవుతున్న సంగతి తెలిసిందే. ఇకపై తెలంగాణ ఇంటర్ బోర్డు కాలేజీల్లోనూ అమలు చేయాలని నిర్ణయించారు.
ఈ లెక్కన లాంగ్వేజెస్, సైన్స్, కామర్స్, ఆర్ట్స్ సబ్జెక్టుల్లోనూ 80 శాతం మార్కులు థియరీకి, 20 శాతం మార్కులు ఇంటర్నల్‌కు కేటాయించనున్నారు. వచ్చే విద్యాసంవత్సరం(2026–27) నుంచి అమలు చేయనుండగా, ఇందుకు అనుగుణంగా సిలబస్‌లోనూ మార్పులు చేయనున్నారు. మారుతున్న కాలానుగుణంగా విద్యార్థుల్లో స్కిల్స్ పెంచేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నదని విద్యాశాఖ అధికారులు చెప్పారు.
Excerpt. Full story at V6 Velugu: https://www.v6velugu.com/first-year-intermediate-students-in-telangana-will-have-an-internal-assessment-component-from-the-2026-27-academic-year
framing not published · 1 outlet covered this story, below the floor for a split