TGSRTC | పండుగ వేళ టికెట్ ఛార్జీల బాదుడు.. 2003 జీవో పేరుతో సమర్థించుకున్న టీజీఎస్ఆర్టీసీ!
Namasthe Telangana · NT News telugu · 2 min read at Namasthe Telangana
TGSRTC | పండుగల వేళ ఆర్టీసీ బస్సు టికెట్ ఛార్జీలను అడ్డగోలుగా పెంచడంపై విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం తమ నిర్ణయాన్ని సమర్థించుకుంది. 2003 నాటి జీవో ప్రకారం నిబంధనలకు అనుగుణంగానే టికెట్ ధరల నిర్ణయాలు తీసుకుంటున్నామని సంస్థ స్పష్టం చేసింది. అయితే, అదే జీవో అమల్లో ఉన్నప్పుడు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో టికెట్ ఛార్జీలు ఎందుకు పెంచలేదని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలోనే ఎందుకు పెరుగుతున్నాయని పలువురు ప్రశ్నిస్తున్నట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
బతుకమ్మ, దసరా పండుగల సందర్భంగా ఆర్టీసీ టికెట్ ధరలను పెంచి ప్రయాణికులపై అదనపు భారం మోపుతున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు ఆరోపించారు. సాధారణ బస్సులను తగ్గించి, స్పెషల్ బస్సుల పేరుతో అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారని విమర్శించారు. ఈ ఆరోపణలను టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం ఖండిస్తూ తమ నిర్ణయాన్ని సమర్థించుకునే ప్రయత్నం చేసింది. పండుగల సమయంలో టికెట్ ధరల పెంపు, ప్రత్యేక బస్సుల నిర్వహణపై హరీశ్రావు చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని తెలిపిన ఆర్టీసీ యాజమాన్యం.. పండుగల సమయంలో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా టికెట్ ధరల నిర్ణయాలు 2003 నాటి జీవో ప్రకారం నిబంధనలకు అనుగుణంగానే…
Excerpt. Full story at Namasthe Telangana: https://www.ntnews.com/telangana/tgsrtc-response-on-rtc-bus-fare-hike-during-bathukamma-dussehra-festival-season-2539537
framing not published · 1 outlet covered this story, below the floor for a split