థర్మల్ ప్లాంట్లలో డేంజర్ బెల్స్!
Namasthe Telangana · NT News telugu · 2 min read at Namasthe Telangana
హైదరాబాద్, అక్టోబర్ 16 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ సర్కార్ నిర్వహణ లోపాలతో రాష్ట్రంలో విద్యుత్తు సంక్షోభం తారస్థాయికి చేరింది. ప్రభుత్వ నిర్లక్ష్యంతో విద్యుదుత్పత్తి కేంద్రాలను బొగ్గుకొరత పట్టి పీడిస్తున్నది. రాష్ట్రంలోని జెన్కో థర్మల్ ప్లాంట్లకు సరిపడా బొగ్గు అందకపోవడంతో నిల్వలు తగ్గుతున్నాయి. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (సీఈఏ) నిబంధనల ప్రకారం 21 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలుండాలి. కానీ రాష్ట్రంలోని ఏ ప్లాంట్‌లోనూ 21 రోజులకు సరిపడా కోల్స్టాక్స్ లేకపోవడం గమనార్హం. ప్రస్తుతం సగటున కేవలం 9 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలే ఉండటం ఆందోళన కలిగిస్తున్నది. యాదాద్రి పవర్ ప్లాంట్…
ఈ ప్లాంట్‌పై రేవంత్ సర్కార్ వివక్ష కారణంగా అవసరం మేరకు బొగ్గు సరఫరా కావడం లేదని ఉద్యోగ వర్గాలే చెప్తున్నాయి. రాష్ట్రంలో కొంత మేరకైనా బొగ్గు నిల్వలున్న ప్లాంట్ ఏదైనా ఉన్నదంటే అది భూపాలపల్లిలోని కాకతీయ థర్మల్ ప్లాంట్ మాత్రమే. తాడిచెర్ల కోల్‌బ్లాక్ జెన్కోకు చెందినది. రోడ్డుమార్గంలో 11 వేల మిలియన్ టన్నుల బొగ్గు సరఫరా అవుతుండగా.. ఈ ఒక్క ప్లాంట్‌కు మాత్రమే అంతో ఇంతో బొగ్గు అందుతున్నది. వైటీపీఎస్‌కు బొగ్గు లింకేజీ లేదని, సరిపడా బొగ్గు అందడం లేదని సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సహా అంతా ఆరోపణలు చేస్తున్నారు. మరి మిగతా ప్లాంట్లల్లో బొగ్గు నిల్వలెందుకు లేవన్న ప్రశ్నలు…
Excerpt. Full story at Namasthe Telangana: https://www.ntnews.com/telangana/coal-shortage-raises-concerns-over-telanganas-power-generation-capacity-2538431
framing not published · 70 outlets covered this story, below the floor for a split