Tiger Shroff | టైగర్ ష్రాఫ్పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Namasthe Telangana · NT News telugu · 1 min read at Namasthe Telangana
Tiger Shroff : నటుడు టైగర్ ష్రాఫ్ (Tiger Shroff) పై కాల్పుల కేసులో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. పోలీస్ విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. లారెన్స్ బిష్ణోయ్ (Lawrence Bishnoi) గ్యాంగ్ హ్యాండ్లర్లు.. బీహార్ (Bihar) లోని బెగుసరాయ్ (Begusarai) కి చెందిన రితిక్ అలియాస్ రోషన్ (Roshan), హర్యానాలోని సోనీపట్కు చెందిన రేహాన్ (Rehan), ఫూల్ సింగ్ (Phool singh) అనే యువకులను సోషల్ మీడియాలో సంప్రదించారు.
వాళ్లపై గొడవలు, ఆయుధాల స్మగ్లింగ్ కేసులు ఉన్నట్లు గుర్తించి ఈ పని కోసం ఎంచుకున్నారు. ఆ ముగ్గురికి విదేశాల్లో మంచి ఉద్యోగం, భవిష్యత్ అవసరాలకు పెద్ద మొత్తంలో డబ్బు ఇస్తామని ఆశచూపారు. అందుకు బాలీవుడ్ నటుడిపై దాడి చేయాలని సూచించారు. కాల్పుల ప్లాన్ను అమలు చేయడానికి అడ్వాన్సుగా రూ.50 వేలు ఇచ్చారు. పని ముగించిన తర్వాత మరింత డబ్బు ఇస్తామని హామీ ఇచ్చారు. లారెన్స్ బిష్ణోయ్ అనుచరుడు, అమెరికాకు చెందిన గ్యాంగ్స్టర్ అనిల్ పండిత్ ఈ ముగ్గురు యువకులతో నిరంతరం సంప్రదింపులు జరిపాడు.
Excerpt. Full story at Namasthe Telangana: https://www.ntnews.com/national/tiger-shroff-shooters-were-promised-jobs-abroad-say-mumbai-cops-2540792
framing not published · 1 outlet covered this story, below the floor for a split