TN: తమిళనాడులో భారీ వర్షాలు
Prajasakti · 1 min read at Prajasakti
తమిళనాడు : తమిళనాడును భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. భారీ వర్షాలకు రోడ్లన్నీ జలమయమయ్యాయి. వాహనదారులు తీవ్రంగా ఇబ్బందిపడ్డారు. శనివారం సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు చైన్నైతోపాటు రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాతావరణ శాఖ చెన్నై, తిరుచిరాపల్లి, కోయంబత్తూరు, నీలగిరి జిల్లాలకు సోమవారం ‘ఆరెంజ్ అలర్ట్’ జారీ చేసింది. ఈ నాలుగు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు హెచ్చరించారు. రాష్ట్రంలోని ఉత్తర, పశ్చిమ, మధ్య, దక్షిణ ప్రాంతాల్లో వర్షాల తీవ్రత ఎక్కువగా ఉండనుంది. ధర్మపురి, కృష్ణగిరి, సేలం, తిరువళ్లూరు, దిండిగల్, తేని, విరుదునగర్…
Excerpt. Full story at Prajasakti: https://prajasakti.com/te-IN/national-newss/national/wf-1792434952879
framing not published · 1 outlet covered this story, below the floor for a split