వచ్చేది మా ప్రభుత్వమే.. మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి.. పోలీసులకు అంబటి వార్నింగ్
V6 Velugu · V6 Velugu · 1 min read at V6 Velugu
గుంటూరు: పోలీసులతో వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రవర్తన చర్చనీయాంశంగా మారింది. గుంటూరు నగరంలో వైసీపీ మేయర్ అభ్యర్థి నామినేషన్ సందర్భంగా పోలీసులపై అంబటి రాంబాబు ధ్వజమెత్తారు.
రెండు సంవత్సరాల తర్వాత తమ ప్రభుత్వమే అధికారంలో ఉంటుందని, ఇక్కడ ఉన్న పోలీసులు అందరూ మంచోళ్ళే కానీ ఒక్కళ్ళు మాత్రం కాదని ఆయన చేసిన వ్యాఖ్యలు స్థానికంగా రచ్చ లేపాయి. తమ ప్రభుత్వం వచ్చిన మొదటి ఆరు నెలలు తానే హోం మంత్రిగా ఉంటానని పోలీసులను హెచ్చరించే ధోరణిలో అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు కాక రేపాయి.
Excerpt. Full story at V6 Velugu: https://www.v6velugu.com/ex-minister-ycp-leader-ambati-rambabu-strong-warning-to-police
framing not published · 1 outlet covered this story, below the floor for a split