వేడివేడి టీ తాగకండి.. అలా అని చల్లబడిపోయాక తాగమని కాదు.. టీ 65°C కంటే వేడిగా ఉంటే..
V6 Velugu · V6 Velugu · 2 min read at V6 Velugu
మన దేశంలో ఛాయ్ అదేనండీ టీ తాగడం అనేది నూటికి 90 శాతం మంది జీవితంలో దైనందిన చర్య. ఉదయాన్నే టీ, కాఫీలు తాగడం వల్ల నూతనోత్తేజం, ఉరకలెత్తే ఉత్సాహంతో ఉంటామనేది చాలా మంది భావన. కొందరు వేడి వేడి టీని అలానే తాగేస్తుంటారు. అలా తాగడం చాలా ప్రమాదమని, ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదని వైద్యులు చెబుతున్నారు. చాలా వేడిగా ఉండే టీ తాగే అలవాటు ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు. టీని 65°C కంటే వేడిగా ఉన్నప్పుడు తాగితే క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని, ఇటీవల.. 'ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ క్యాన్సర్'లో ఒక అధ్యయనం ప్రచురించారు.
ఈ అధ్యయనంలో సుమారు 10 లక్షల మంది పాల్గొన్నారు. 65°C కంటే ఎక్కువ ఉష్ణోగ్రత ఉన్న టీ లేదా కాఫీ తాగేవారికి అన్నవాహిక క్యాన్సర్ (ఆహార నాళానికి వచ్చే ఒక రకమైన క్యాన్సర్) వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని ఈ అధ్యయనం తేల్చింది. అలాగే.. ప్రతిరోజూ ఆరు లేదా అంతకంటే ఎక్కువ కప్పుల టీ లేదా కాఫీ తాగేవారికి ఈ క్యాన్సర్ వచ్చే ప్రమాదం 71 శాతం ఎక్కువగా ఉందని కూడా ఈ అధ్యయనం వెల్లడించింది.
Excerpt. Full story at V6 Velugu: https://www.v6velugu.com/the-habit-of-drinking-very-hot-tea-is-dangerous-if-it-is-hotter-than-65%C2%B0c-there-is-a-risk-of-cancer
framing not published · 1 outlet covered this story, below the floor for a split