Vigilance Raids | గద్వాల జిల్లాలో రైస్ మిల్లులపై విజిలెన్స్ అధికారుల దాడులు
Namasthe Telangana · NT News telugu · 1 min read at Namasthe Telangana
జోగులాంబ గద్వాల : ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో గత రెండు రోజులుగా రైస్ మిల్లుల ( Rice Mills ) పై విజిలెన్స్ అధికారుల దాడులు ( Vigilance Raids ) కొనసాగుతున్నాయి. తాజాగా శనివారం గద్వాల జిల్లాలో దాడులు కొనసాగాయి. కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) ధాన్యం నిల్వలు, బియ్యం అప్పగింతల్లో భారీగా అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు రావడంతో అధికారులు తనిఖీలు చేపట్టినట్లు సమాచారం.
కోట్ల రూపాయల విలువైన సీఎంఆర్ ధాన్యం మాయమైనట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో విజిలెన్స్ అధికారులు ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు సమాచారం. జిల్లాలోని పలు మిల్లుల్లో ధాన్యం నిల్వలు, రికార్డులు, ప్రభుత్వానికి అప్పగించాల్సిన బియ్యం వివరాలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
Excerpt. Full story at Namasthe Telangana: https://www.ntnews.com/telangana/vigilance-officials-conduct-raids-on-rice-mills-in-gadwal-district-2538664
framing not published · 13 outlets covered this story, below the floor for a split