వివాహ సంబంధం పేరుతో ఐఏఎస్ అధికారికి టోకరా..బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించిన బాధితుడు
V6 Velugu · V6 Velugu · 1 min read at V6 Velugu
జూబ్లీహిల్స్, వెలుగు: వివాహ సంబంధం కుదిర్చే పేరుతో ఓ ఐఏఎస్ అధికారికి ఘరానా మోసం ఎదురైంది. తన కుమారుడికి తగిన వధువును వెతికిపెడతామని నమ్మించిన మ్యాట్రిమోనీ సంస్థ నిర్వాహకులు రూ.2 లక్షలు వసూలు చేసి, ఆ తర్వాత ముఖం చాటేయడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించారు. సీనియర్ ఐఏఎస్ అధికారి పునీత్ కుమార్ గోయల్ చేసిన ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 1991 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి పునీత్ కుమార్ గోయల్ తన కుమారుడి వివాహం కోసం 2024 జూలైలో 'సెవెన్ వోవ్స్' మ్యాట్రిమోనీ సంస్థను ఆశ్రయించారు. మంచి సంబంధాలు కుదిస్తామని నమ్మించిన ఆ సంస్థ ప్రతినిధులు తొలుత ఆయన నుంచి రూ. లక్ష వసూలు చేశారు. మొదట్లో కొన్ని సంబంధాల వివరాలు చూపించిన ఆ సంస్థ నిర్వాహకులు, ఆ తర్వాత పూర్తిగా స్పందించడం మానేశారు.దీంతో తాను మోసపోయానని గ్రహించిన ఆయన.. మొత్తం రూ.2 లక్షలు నష్టపోయినట్లు తెలిపారు. సంస్థ ప్రతినిధులు సుమన్ అగర్వాల్, నైనా తమను మోసం చేశారని పేర్కొంటూ వారిపై తగిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Full story at V6 Velugu: https://www.v6velugu.com/senior-ias-officer-puneet-kumar-goyal-cheated-of-rs-2-lakh-in-matrimonial-scam-
framing not published · 1 outlet covered this story, below the floor for a split