Voditela Sathish kumar | సింగరేణి కార్మిక గర్జనకు తరలిన చిగురుమామిడి బీఆర్ఎస్ శ్రేణులు
Namasthe Telangana · NT News telugu · 1 min read at Namasthe Telangana
Voditela Sathish kumar | చిగురుమామిడి, అక్టోబర్ 14 : పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించే సింగరేణి కార్మిక గర్జన భారీ బహిరంగ సభకు చిగురుమామిడి మండలం నుండి బీఆర్ఎస్ శ్రేణులు తరలివెళ్లారు. హుస్నాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ ఆధ్వర్యంలో మండలం నుండి వివిధ గ్రామాలకు చెందిన సుమారు 30 మంది బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు వాహనాల్లో గోదావరిఖనికి బయలుదేరారు. ఈ సందర్భంగా హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వోడితల సతీష్ కుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో సింగరేణి కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.గత సంవత్సరం ప్రభుత్వం…
సింగరేణి కార్మికులపై వివక్ష చూపుతూ, ఇచ్చిన హామీలను విస్మరిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూనే ఈ కార్మిక గర్జన సభను నిర్వహిస్తున్నామన్నారు. బీఆర్ఎస్ పోరాటానికి సర్కారు భయపడి దిగివచ్చిందని, సింగరేణి కార్మికులకు అండగా బీఆర్ఎస్ ఎల్లప్పుడూ ఉంటుందని స్పష్టం చేశారు. సింగరేణి కార్మికుల సమస్యలైన వారసత్వ ఉద్యోగాలు, కారుణ్య నియామకాలు, బోనస్ పెంపు, ఇంటి స్థలాలు వంటి హామీలను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా నాయకులు కొత్త శ్రీనివాస్ రెడ్డి, నాయకులు మామిడి అంజయ్య, కానుగంటి భూమిరెడ్డి, కత్తుల రమేష్, మిట్టపల్లి మల్లేశం, పెనుకుల తిరుపతి, పిల్లి వేణు…
Excerpt. Full story at Namasthe Telangana: https://www.ntnews.com/karimnagar/chigurumamidi-brs-cadres-head-to-the-singareni-workers-rally-2536603
framing not published · 1 outlet covered this story, below the floor for a split